YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్నకు తమ్ముళ్ల సెగ

అచ్చెన్నకు తమ్ముళ్ల సెగ

శ్రీకాకుళం, మే 21, 
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కేంద్రంగా అప్పుడే పార్టీలో పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. “హ‌న్నన్నా.. అచ్చెన్న వ‌స్తే.. ఏదో జ‌రిగిపోతుంద‌ని అనుకున్నాం. కానీ, ఏమీ జ‌ర‌గ‌డం లేదు. ఉన్నది కూడా పాయేనా?“ అని త‌మ్ముళ్ల మ‌ధ్య సైలెంట్ చ‌ర్చ న‌డుస్తోంది. అచ్చెన్నాయుడు పైకి మాత్రం గంభీరంగా క‌నిపించినా.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విష‌యంలో మాత్రం ఎక్కడా దూకుడు చూపించ‌లేక పోతున్నార‌నేది నేతల వాద‌న‌. పైగా ఎక్కడా పార్టీలో ఆయ‌న ఇప్పటి వ‌ర‌కు నేత‌ల‌తో సంపూర్ణంగా భేటీ అయింది లేదు. నేత‌లతో పార్టీ ప‌రిస్థితిపై చ‌ర్చించింది కూడా క‌నిపించ‌డం లేదు.ముఖ్యంగా ప్రభుత్వాన్ని డామినేష‌న్ చేసేలా రాజ‌కీయాలు చేయ‌డంలోను, వ్యూహాలు ప‌న్నడంలోను అచ్చెన్నాయుడు విఫ‌ల‌మ‌య్యార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, టీడీపీలోనూ ఇలాంటి చ‌ర్చే జ‌రుగుతోంది. నిజానికి పార్టీ అధినేత అన్నాక‌.. దూకుడుగా ఉండాలి. అదే స‌మ‌యంలో పార్టీ నేత‌ల‌ను కూడా క‌లుపుకొని పోవాలి. కానీ, ఇప్పటి వ‌ర‌కు అచ్చెన్నాయుడు ఈ త‌ర‌హా ఆలోచ‌న చేయ‌లేక పోయారు. అదే స‌మ‌యంలో ప్రభుత్వానికి కౌంట‌ర్లు కూడా ఇవ్వలేక పోతున్నారు. తిరుపతి ప్రచార స‌మ‌యంలో నారా లోకేష్‌పై చేసిన కామెంట్లు మ‌రింత‌గా అచ్చెన్నాయుడు రికార్డును బ‌ద్నాం చేశాయి.పార్టీని నిల‌బెట్టాల్సిన న‌డిపించాల్సిన నాయ‌కుడు ఇలా వ్యాఖ్యానించ‌డం ఏంట‌నే వాద‌న పార్టీలోనే వినిపించింది. అయితే.. ఈ మొత్తానికి.. కార‌ణం.. అచ్చెన్నాయుడుపై ఉన్న కేసులు.. నియోజ‌క‌వ‌ర్గంలో చేస్తున్న కొన్ని వ్యవ‌హారాలే కార‌ణమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్‌పై వ్యాఖ్యలు చేస్తే.. మ‌ళ్లీ కేసులు పెడ‌తారేమో.. అని.. భావిస్తున్నార‌ని.. అందుకే మౌనంగా ఉంటున్నారని.. పార్టీలో ఇప్పుడు ఊపులేద‌ని.. తాను మాత్రం ఏం చేస్తాన‌నే నిర్లిప్తత కూడా అచ్చెన్నాయుడులో క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఇక పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షుల‌తో అచ్చెన్నాయుడు నేరుగా ట‌చ్‌లోకి వెళ్లిపోతున్నారు. ఇది కూడా పార్టీలో కొంద‌రికి న‌చ్చడం లేదు. ఈ కార‌ణాల‌తోనే ఆయ‌న మౌనంగా ఉంటున్నార‌న్న చ‌ర్చలు స్టార్ట్ అయ్యాయి. ఇది నిజ‌మే అయితే.. ఖ‌చ్చితంగా అచ్చెన్న త‌న‌ను తాను ప‌రిశీలించుకుని మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నే చెప్పాలి

Related Posts