YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రెండేళ్ల తర్వాత కోలుకోలేదే

రెండేళ్ల తర్వాత కోలుకోలేదే

విజయవాడ, మే 24, 
తెలుగుదేశం పార్టీ రెండేళ్ల తర్వాత కూడా ఓటమి నుంచి కోలుకోలేదు. చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం కన్పించడం లేదు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత నేతలు మరింత డీలా పడ్డారు. ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేకపోయినా కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపును కూడా నేతలు పట్టించుకోవడంలేదు. జిల్లాకు ఒకిరద్దరు మినహా నేతలు స్పందించడం లేదు.కరోనా వ్యాక్సినేషన్ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు పిలుపునిచ్చినా ఏమాత్రం స్పందన కన్పించలేదు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయారు. మండల స్థాయి నేతల నుంచి నియోజకవర్గ స్థాయి నేతల వరకూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. కొందరికి పెండింగ్ బిల్లులు రాకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదు.వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే తాము ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎక్కువ మంది నేతలు వ్యాపారాలపైనే దృష్టి పెట్టారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో ఉండే తమ వ్యాపారాలను వారే స్వయంగా చూసుకుంటున్నారు. నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ కేంద్ర నాయకత్వానికి అందిన నివేదిక ప్రకారం దాదాపు 90 నియోజకవర్గాల్లో నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారన్న నివేదిక పార్టీ అధినాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.కరోనాను చూపుతూ…అయితే దీనికి కరోనా ను కారణంగా చూపుతున్నారు. కరోనా కారణంగానే తాము బయటకు రాలేకపోతున్నామని కొందరు నేతలు పార్టీ నాయకత్వానికి వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. చంద్రబాబు సయితం హైదరాబాద్ లోనే ఉండి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండటంతో మిగిలిన నేతలకు అది అలుసుగా మారిందంటున్నారు. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో జోష్ నెలకొంటుందన్న చంద్రబాబు అంచనాలు తలకిందులయ్యాయి.

Related Posts