YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బనగానపల్లెలో ఆర్ధరాత్రి ఉద్రిక్తత మాజీ ఎమ్మెల్యే బీసీ ఆరెస్టు

బనగానపల్లెలో ఆర్ధరాత్రి  ఉద్రిక్తత మాజీ ఎమ్మెల్యే బీసీ ఆరెస్టు

కర్నూలు
బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ కర్నూలు జిల్లా బనగానపల్లె లో చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులు అమర్నాథ్ రెడ్డి. మహమ్మద్. దుర్గ. అనే ముగ్గురు వ్యక్తులు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతంలో బైకుపై చక్కర్లు కొడుతుండగా ఆగ్రహానికి గురైన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తమ ఇంటి ముందు ఎందుకు తిరుగుతున్నారని మాజి ఎమ్మెల్యే బీసీ ప్రశ్నించారు. మీరు ఎవరు మాకు చెప్పడానికి అని ఎదురు ప్రశ్న వేసిన కాటసాని అనుచరులు. ఆగ్రహానికి గురైన బీసీ వర్గీయులు కాటసాని వర్గీయులు పై దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని  బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో దుర్గా. అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.  బనగానపల్లె లో చికిత్స పొందుతున్న  తమ అనుచరులను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  పరామర్శించారు. ఘర్షణల నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసారు. జనార్దన్ రెడ్డి తో పాటు మరో తమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం జరగింది. *టిడిపి కార్యకర్తల్లో భయాందోళనలు , సృష్టించేందుకే  పోలీసుల అత్యుత్సాహం  ప్రధర్శిస్తున్నారని  జనార్దన్ రెడ్డి ఆరోపించారు. అర్ధరాత్రి జనార్దన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ పోలీసుల వాహనాలను బిసి అనుచరుల వాహనాలు అనుసరించాయి. జనార్దన్ రెడ్డిని  డోను పోలీస్ స్టేషన్ కు తరలించారు. బనగానపల్లె లో  పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. 

Related Posts