YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ ప్రభుత్వ కొత్త ఆంక్షలు

తెలంగాణ ప్రభుత్వ కొత్త ఆంక్షలు

హైదరాబాద్,   తెలంగాణ ప్రభుత్వ కొత్త ఆంక్షలు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్... - ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి ఆంధ్ర వాహనాలను తిరిగి వెనక్కి పంపుతున్న పోలీసులు అంబులెన్సు అత్యవసర వాహనాలకు మినహాయింపు  ;
 ఆంధ్ర‌, తెలంగాణా స‌రిహ‌ద్దుల్లో మ‌ళ్ళీ ఆంక్ష‌లు మొద‌ల‌య్యాయి. తెలంగాణా ప్ర‌భుత్వం కొత్త‌గా అక్క‌డ కోవిడ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది. ఆంధ్ర‌, తెలంగాణా స‌రిహ‌ద్దు గ‌రిక‌పాడు చెక్ పోస్ట్ వ‌ద్ద తెలంగాణా పోలీసులు మోహ‌రించారు. ప్ర‌భుత్వం నుంచి ఈ- పాస్ లేనిదే ఏ వాహనాన్ని తెలంగాణాలోకి అనుమ‌తించ‌డం లేదు. దీనితో ఆంధ్ర వాహ‌నాలు భారీగా స‌రిహ‌ద్దులో నిలిచిపో్తున్నాయి. వాటికి ఈ పాస్ ఉంటే నే అనుమ‌తి అని పోలీసులు చెపుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఆంధ్ర నుంచి వ‌చ్చే అంబులెన్స్ ల‌ను అడ్డుకున్నారు. దీనితో కోవిడ్ బాధితులు తీవ్ర ఇబ్బంది ప‌డ్డారు. ఆక్సీజ‌న్ తో అంబులెన్స్ లో ఉన్న వారినీ అనుమ‌తించ‌క‌పోవ‌డంతో వ్య‌వ‌హారం హైకోర్టు వ‌ర‌కు వెళ్ళింది. చివ‌రికి అక్క‌డి హాస్ప‌ట‌ల్ అనుమ‌తులు ఉంటే అంబులెన్స్ లు అనుమ‌తిస్తామ‌ని అధికారులు చెప్పారు. చివ‌రికి అంబులెన్స్ ల‌ను అడ్డుకోవ‌ద్ద‌ని కోర్టులు సూచించ‌డంతో ఆ వ్య‌వ‌హారం ఒక కొలిక్కి వ‌చ్చింది. ఇపుడు కొత్త‌గా బోర్డ‌ర్ చెక్ పోస్ట్ పెట్టి...ఈ పాస్ లు ఉంటేనే అనుమ‌తిస్తామంటున్నారు.

Related Posts