YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

తీవ్ర తుపాను గా యాస్

తీవ్ర తుపాను గా యాస్

విశాఖపట్టణం, మే 24, 
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం తుఫానుగా మారినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది మరో 12 గంటల్లో అత్యంత తీవ్ర తుఫానుగా రూపాంతంరం చెందుతుందని పేర్కొంది. దీనికి ‘యాస్’అని పేరును సూచించారు. గత ఆరు గంటలుగా నుంచి గంటకు 2 గంటల వేగంతో వాయవ్య దిశగా కదులుతున్నట్టు ఐఎండీ వివరించింది. ఈ తుఫాను ప్రస్తుతం అండమాన్ దీవుల్లోని పోర్ట్ బ్లయిర్‌కు ఉత్తర-వాయవ్యంగా 620 కిలోమీటర్లు, ఒడిశాలోని పరాదీప్‌, బాలాసోర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ-ఆగ్నేయంగా 620 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో తీవ్రతుఫానుగా మారుతుంది. తర్వాత 24 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫానుగా రూపాంతంరం చెందుతుందని పేర్కొంది. మే 26న తెల్లవారుజామున ఒడిశా-బెంగాల్‌ మధ్య తీరానికి చేరుతుంది. పరాదీప్-సాగర్ ఐల్యాండ్ మధ్య అత్యంత తీవ్ర తుఫానుగానే తీరం దాటుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. మంగళవారం తీవ్ర తుఫానుగా మారిన తర్వాత గాలుల వేగం గంటకు 155 నుంచి 170 కిలోమీటర్ల ఉంటుందని తెలిపింది. మే 26న తీరం దాటే సమయానికి 185 కిలోమీటర్లకు చేరుకుంటాయని హెచ్చరించింది.యాస్ తుఫాను కారణంగా ఒడిశా- పశ్చిమ్ బెంగాల్ తీర ప్రాంతాలకు యెల్లో హెచ్చరికలు జారీచేశారు. తుఫాను ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర తీరంలో మే 24న చాలా చోట్ల మోస్తరు నుంచి సాధారణ వర్షాలు, మే 25 పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఒడిశాలోని పూరి, జగత్సింగ్‌పూర్, ఖుర్దా, కటక్, కేంద్రపడ, జైపూర్, భద్రక్, బలాసోర్ జిల్లాల్లో మే 24న భారీ నుంచి అతిభారీ వర్షాలు, మే 25, 26 పై జిల్లాలతోపాటు గంజాల్, ఢెంకనాల్, మయూర్బంజ్ జిల్లాల్లో కుంభవృష్టి కరుస్తుంది. బెంగాల్‌లో అతిభారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. తుఫాను ప్రభావంతో ఝార్ఖండ్, బిహార్, అసోం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో మే 26, 17 తేదీల్లో మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
యాస్ అంటే మల్లెపువ్వు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం తుపానుగా మారనుంది. మరో 24 గంటల తర్వాత మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ నెల 26 సాయంత్రానికి ఇది ఉత్తర ఒడిశాలోని పారాదీప్‌, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనికి ‘యాస్‌’ అనే పేరును ఒమన్‌ దేశం సూచించింది. ‘యాస్’ అంటే అక్కడి భాషలో మల్లె పువ్వు అని అర్థం.వాయుగుండం కారణంగా ఇప్పటికే అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో 25-27 మధ్య ఒడిశా, పశ్చిమబెంగాల్‌, సిక్కింలోని పలు జిల్లాల్లో ఈ స్థాయిలో వర్షాలు కురవనున్నాయి. 26 మధ్యాహ్నం నుంచి తుపాను తీరం దాటేదాకా గంటకు 90-110 కి.మీ వేగంతో, తీరం దాటేటప్పుడు 155-165 నుంచి 185 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆయా తేదీల్లో మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా, అసాధారణంగా మారుతుందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.వాతావరణశాఖ హెచ్చరికలతో తుపాను ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కూడా తుపానుపై సమీక్ష నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. మరోవైపు తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ‘జాతీయ విపత్తు ఉపశమన దళం’ (ఎన్డీఆర్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌ తెలిపారు. తుపానును ఎదుర్కొనేందుకు నౌకాదళం, తీరగస్తీ దళం (కోస్ట్‌గార్డ్‌) అప్రమత్తమయ్యాయి. నాలుగు యుద్ధ నౌకలు, 11 సరకు రవాణా విమానాలు, 25 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు నేవీ ప్రకటించింది. ఆదివారం కోల్‌కతా, పోర్ట్‌బ్లెయిర్‌లకు 334 ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను, 21 టన్నుల సామగ్రిని భారత వాయుసేన చేరవేసింది.

Related Posts