YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అతడిని చూసి ఫిదా : అనసూయ

అతడిని చూసి ఫిదా : అనసూయ

హైదరాబాద్, మే 24, 
బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా పాపులర్ అయిన యాంకర్అనసూయ.. వెండితెరపై రంగమ్మత్తగా వరుస మంచి ఫామ్‌లో ఉంది. ఇటు టీవీ షోస్ అటు సినిమాలు.. మరోవైపు సోషల్ మీడియా ఇలా అన్నీ హ్యాండిల్ చేస్తూ ప్రేక్షకులను యమ అట్రాక్ట్ చేస్తోంది. రీసెంట్‌గా 'థాంక్యూ బ్రదర్' సినిమాలో గర్భవతిగా ఛాలెంజింగ్ రోల్ చేసి సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి రియాక్ట్ అవుతూ బన్నీ గురించి కామెంట్స్ చేసింది అనసూయ.ఇటీవలే తాను 'పుష్ప' సినిమాలో నటిస్తున్నా అంటూ కన్ఫర్మ్ చేసిన అనసూయ.. ఈ మూవీలో పవర్ ప్యాక్ట్ రోల్‌లో కనిపించబోతున్నా అంతకుమించి అడగొద్దు అంటూ తన పాత్రపై చిన్న హింట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన రోల్ షూటింగ్ అప్‌డేట్ కూడా ఇచ్చేసింది. 'పుష్ప' షూటింగ్‌లో ఈ జబర్దస్త్ భామ కేవలం నాలుగు రోజులే పాల్గొందట. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ నాలుగు రోజుల్లోనే అల్లు అర్జున్ డెడికేషన్ చూసి ఫిదా అయ్యానంటూ బన్నీ అభిమానులను అట్రాక్ట్ చేసే కామెంట్స్ చేసింది యాంకరమ్మ.కేవలం నాలుగు రోజుల్లో అల్లు అర్జున్‌తో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చిన అనసూయ.. బన్నీకి మల్టీ టాలెంట్ ఉందంటూ తెగ పొగిడేసింది. ఆయనకు నేమ్, ఫేం రెండూ ఉన్నప్పటికీ తన మొదటి సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి కూడా అంతే కష్టపడుతున్నారని చెప్పింది. అల్లు అర్జున్ పాత్రతో ప్రేక్షకులు ఎగ్జైట్మెంట్‌గా ఫీల్ కావడం మాత్రం పక్కా అని అనసూయ తెలిపింది. సో.. సినిమా విడుదలైతే గానీ చెప్పలేం ఈ 'పుష్ప'లో అనసూయ, అల్లు అర్జున్ క్యారెక్టర్స్ సుకుమార్ ఏ రేంజ్‌లో డిజైన్ చేశారనేది.

Related Posts