YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గుత్తా కు షాకా.. ప్రమోషనా..

గుత్తా కు షాకా.. ప్రమోషనా..

నల్గొండ, మే 31, 
గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం పూర్తికావచ్చింది. ఆయనను మరోసారి ఎమ్మెల్సీగా కేసీఆర్ ఎంపిక చేస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. ఆయన శాసనమండలి ఛైర్మన్ గా కూడా ఉన్నారు. ఈ పదవి కూడా ఉంటుందా? లేదా? అన్నది కూడా పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. ఎవరికి అనుకూలంగా? ఎవరికి వ్యతిరేకిస్తారో తెలియకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈటల రాజేందర్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ.గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చి చేరారు. ఆయనకు మంత్రి కావాలని కోరిక. అయితే ఆయనను ఎమ్మెల్సీ చేసి శాసనమండలి ఛైర్మన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. కేబినెట్ ర్యాంకు పదవి కావడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి ఖుషీగానే ఉన్నారు. అయితే ఆయన పదవీ కాలం జూన్ 3వ తేదీతో ముగియనుంది. గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్ల పదవీకాలం పూర్తవుతుంది.వీరిలో ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. మరోసారి వీరికి ప్రాధాన్యత ఇస్తారా? టీఆర్ఎస్ కు తొలినుంచి పనిచేస్తున్న వారికి కేసీఆర్ పదవులు ఇస్తారా? అన్నది చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈటల రాజేందర్ ఊరారా తిరిగి ఉద్యమంలో పాల్గొన్న వారికి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో సహా పార్టీలు మారి వచ్చిన వారికి తిరిగి రెన్యువల్ చేస్తారా? లేదా? అన్నది సందేహంగా మారింది.దీంతో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానంలో ఇటీవల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన పీవీ కుమార్తె సురభి వాణీదేవిని నియమిస్తారన్న ప్రచారం ఎటూ ఉండనే ఉంది. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డిని శాసనమండలి ఛైర్మన్ పదవిలో కొనసాగించడం కష్టమేనంటున్నారు. అయితే సామాజికవర్గాల సమీకరణలు చూస్తే గుత్తా సుఖేందర్ రెడ్డి ని మరోసారి ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts