YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జీజీహెచ్ లో చికిత్స పొందుతూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి

జీజీహెచ్ లో చికిత్స పొందుతూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి

నెల్లూరు
ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత కోలుకుంటున్నట్లుగా చెప్పిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య కన్నుమూశారు. గతంలొ సామాజిక మాధ్యమాల్లో కోటయ్య వీడియోలు హల్చల్ చేశాయి. అయితే ఆనందయ్య వైద్యాన్ని తప్పుగా నిరూపించడం కోసం కూడా ప్రయత్నాలు జరిగాయి. తాజాగా ఆయన జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే కరోనా మందు తీసుకున్న హెడ్ మాస్టర్ కోటయ్య ఆరోగ్యం కొద్ది రోజుల క్రితం మరోసారి క్షీణించింది. ఆనందయ్య మందుతో కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయని ప్రచారం జరిగింది. అయితే, అనంతరం కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.  గతంలో  దాదాపు మరణం అంచులకు వెళ్లి ఆనందయ్య మందుతో తిరిగి వచ్చానని కోటయ్య చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ‘‘ఊపిరి అందడంలేదు. కొన ఊపిరితో ఉన్న.. ఇంకా రెండు నిముషాలు ఆగితే, ఆక్సిజన్ లేకపోతే చనిపోతా.. దీంతో వెంటనే మావాళ్లు వచ్చి వెంటనే కంటిలో మందు వేశారు. 10, 15 నిముషాల్లో కోలుకున్నానని, ఈ మందు చాలా అద్భుతమని గతంలో కోటయ్య తెలిపారు. అయితే, ఆయన చికిత్స పొందుతూ చనిపోవడంతో ఆనందయ్య మందుపై సందేహాలు నెలకొన్నాయి.

Related Posts