YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పోస్టాఫీసుల్లో వ్యాక్సినేషన్

పోస్టాఫీసుల్లో వ్యాక్సినేషన్

వరంగల్, జూన్ 2, 
కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ పంపిణీ నిర్వహిస్తోంది. అయితే..ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందుకు స్మార్ట్ ఫోన్ కంపల్సరీగా ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే..ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. సమీపంలో ఉన్న పోస్టాఫీస్ కు వెళితే సరిపోద్ది..అంటున్నారు. టీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్లాట్ బుకింగ్ చేసుకొనే వారికి సహకరించాలని తాజాగా..పోస్టాఫీస్ శాఖాధికారులు నిర్ణయించారు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.ప్రస్తుతం కరోనా టీకా తీసుకోవాల్సి ఉంటే..కొవిన్ పోర్టులో కు వెళ్లి అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం టీకా కేంద్రాన్ని ఎంపిక చేసుకుని..స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిన అ వసరం ఉంది. ఇందుకు స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ లు లేక..అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్య మరీ అధికంగా ఉంది. ఈ క్రమంలో పోస్టాఫీసుల్లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ సేవలను కేంద్రం అనుమతించింది.దీనిని ప్రధాన మంత్రి నియోజకవర్గం వారణాసిలో దీనిని ప్రారంభించారు. అనంతరం దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులకు విస్తరించారు. తెలంగాణ రాష్ట్రంలోని 36 హెడ్ పోస్టాఫీసులు, 643 సబ్ హెడ్ పోస్టాఫీసులు, 810 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో  ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేయనున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు…తమ సమీప పోస్టాఫీసు కు వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఫోన్ తీసుకెళ్లాలి. దానికి వచ్చే OTPని నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇక పోస్టాఫీసుకు వచ్చే వారు ఖచ్చితంగ కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Related Posts