YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పెద్దపల్లి,
జిల్లా కేంద్రంలో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ప్రాగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు డాక్టర్ కె.వి.రమణా చారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్‌ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకముందు ఎంపీడీఓ కార్యాలయం అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించి,అయ్యప్ప స్వామి గుడి వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు  వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు డాక్టర్ కె.వి.రమణా చారి మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ వాసుల దశాబ్దాల పోరాటం ఫలించగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం తెలంగాణ ఆవిర్బావ దినోత్సవంగా జరుపుకుంటు న్నామని,సాదించుకున్న  తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ నిరుపేదలకు అండగా తెరాస ప్రభుత్వం నిలిస్తుందని, కేసీఆర్ పరిపాలనతోనే బంగారు తెలంగాణ సాద్యమవు తుందన్నారు.సీఎం కేసీఆర్ కు,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లకు,ప్రపంచంలోని తెలంగాణ ప్రజలకు,రాష్ట్ర ప్రజల ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలేక్టర్ (లోకల్ బాడీస్ ) కుమార్ దీపక్,ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,డీసీపీ రవిందర్,ఏసీపీ సాదుల సారంగపాణి,ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గోన్నారు. 

Related Posts