YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రజల ప్రాణాలను కాపాడే మందులో వైసీపీ నేతల అవినీతి... అక్రమాలను ప్రశ్నిస్తే కేసులా...?

ప్రజల ప్రాణాలను కాపాడే మందులో వైసీపీ నేతల అవినీతి... అక్రమాలను ప్రశ్నిస్తే కేసులా...?

కడప జూన్ 7
కడప శివారులోని రిమ్స్ వద్ద 19వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జి, వి.ఎస్.అమీర్ బాబు. ఈ సందర్భంగా వి.ఎస్.అమీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.....
స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్ ఉంటే దానిని 24% చెశావు ఇదేనా నీకు బి,సి ల మీద ప్రేమ...! అని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు నవరత్నాలను ఇస్తూ అన్నీ ఇచ్చేశామంటూ ఎస్సీలను, బిసిలను మోసం చేశారని మండిపడ్డారు ఒక్క చాన్స్ అని చెప్పి మోసపూరిత మాటలు చెప్పి వారి ఓట్లు వెయించుకుని వారిని పూర్తిగా విస్మరిస్తున్నారాని దుయ్యబట్టారు నవరత్నాలలో ఇచ్చినవి కలుపుకుని ఎస్సీ లకు, బి,సి లకు న్యాయం చేశామని చెప్పుకోవడం నీకే చెల్లింది అని ధ్వజమెత్తారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు ప్రజల ప్రాణాలు కాపాడే మందులో వైసీపీ నేతల అవినీతి అక్రమాలను, ప్రశ్నిస్తే కేసులా...?  అని ప్రశ్నించారు ఆనందయ్య మందుని ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ప్రయత్నించిన నర్మద్‌రెడ్డి... వైసీపీ ఎమ్మెల్యే కాకాణికి సన్నిహితులుకారా? అని ప్రశ్నించారు కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రమేయం లేకుండానే నర్మద్‌రెడ్డి వెబ్‌సైట్ ప్రారంభించారా? అని నిలదీశారు ప్రభుత్వానికి, శ్రేశిత టెక్నాలజీస్ వెబ్‌సైట్‌కి సంబంధం లేకపోతే.. వెంటనే కాకాణిపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం తక్షణమే సోమిరెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కొవిడ్ నిబంధనల పేరుతో ధూళిపాళ్ల నరేంద్రపై పెట్టిన కేసును కూడా తీసేయాలని వి.ఎస్.అమీర్ బాబు డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో  టీడీపీ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శివకొండా రెడ్డి, జలతోటి జయకుమార్, జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, ఛాన్ బాష, తదితరులు పాల్గొన్నారు. 

Related Posts