YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మోడీతో ఉద్ధవ్ భేటీ... వ్యక్తిగతంగా కలిస్తే తప్పేంటి : ఉద్దవ్

మోడీతో ఉద్ధవ్ భేటీ... వ్యక్తిగతంగా కలిస్తే తప్పేంటి : ఉద్దవ్

ముంబై, జూన్ 8, 
ప్రధాని నరేంద్ర మోదీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖాముఖి మాట్లాడటానికి పది నిమిషాల సమయం మోదీని ఉద్ధవ్ కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఠాక్రే ఎందుకు ఇలా అడిగారనేది మాత్రం తెలియరాలేదు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ సహా ప్రతినిధుల బృందం ప్రధానిని కలిసింది. ఈ సందర్భంగా మరాఠా రిజర్వేషన్ల కోటా, తౌక్టే తుఫాను సాయం గురించి మోదీతో చర్చించినట్టు సమాచారం.మరాఠా రిజర్వేషన్ల అంశంపై విధానపరంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి ఉద్ధవ్ ఠాక్రే గత నెలలో లేఖ రాశారు. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు గతవారం నిలుపుదలచేసిన విషయం తెలిసిందే. ఇది రాజ్యాంగ విరుద్ధమని, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని గతంలో ఇచ్చిన తీర్పు ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ఉదాహరణగా పేర్కొంది. ఆర్ధికంగా వెనుకబడినవారికి మహారాష్ట్ర ప్రభుత్వం మే 31న 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది.ఈబీసీ కోటను బాంబే హైకోర్టు నిలుపుదల చేసింది... కానీ, నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు వదిలేసింది. కేంద్రం, బీజేపీపై అధికార పత్రిక సామ్నాలో తరుచూ శివసేన విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదని ఆరోపిస్తోంది. మరాఠా రిజర్వేషన్ల అంశంపై బీజేపీ రాజకీయం చేస్తోందని దుయ్యబట్టింది. గత నెలలో ఈ మేరకు సంపాదకీయాన్ని ప్రచురించిందిఘర్షణ నిర్ణయాత్మకమైనదని రుజువు చేస్తుంది. మహారాష్ట్ర రాజకీయాలను అస్థిరపరిచేందుకు, ప్రతిపక్షం మరాఠా రిజర్వేషన్ సమస్యను ఆయుధంగా ఉపయోగించుకుంటుంది.. దానిని వారు ఆపేయాలి’’ అని విమర్శించింది

Related Posts