YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కేంద్ర కేబినెట్ ఆశలు

కేంద్ర కేబినెట్ ఆశలు

విజయవాడ, జూన్ 15, 
కేంద్ర మంత్రి వర్గ విస్తరణపైన ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. సాధ్యమైనంత త్వరలో విస్తరణ ఉంటుంది అన్నది ఢిల్లీ వర్గాల భోగట్టా. అదే జరిగితే ఎవరెవరికి కేంద్ర బెర్తులు దక్కుతాయి అన్నది కూడా చర్చగా ఉంది. అన్నిటికంటే ముందుగా ఏపీ నుంచి ఈసారి ఎవరికి చోటు ఉంటుంది అన్నది కూడా చాలా మంది ఆలోచనగా ఉంది. 2018 తరువాత కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి చోటు లేకుండా పోయింది. నాడు టీడీపీ తన మంత్రుల చేత రాజీనామా చేయించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక మళ్లీ మోడీ సర్కార్ లో ఏపీ నుంచి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనడంతోనే ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హెటెక్కుతున్నాయి. ఎందుకంటే బీజేపీతో ఇక్కడ విభేదించే పార్టీలే లేవు అన్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ బీజేపీ ప్రాపకం కోసం తాపత్రయపడుతున్నాయని అంటారు. ఇక చంద్రబాబు మాజీ మిత్రుడు పవన్ కళ్యాణ్ ఇపుడు బీజేపీకి మంచి నేస్తం. 2024 నాటికి ఆయన ద్వారా బీజేపీని తన వైపునకు తిప్పుకోవాలని చూస్తున్న చంద్రబాబు కూడా విస్తరణ జరిగితే ఏపీ నుంచి ప్రాతినిధ్యం ఉండేలా పావులు కదుపుతున్నారుట. ఆయనకు తన మాజీ మిత్రుడు పవన్ కేంద్ర మంత్రి అయినా తనకు చాలు అన్నట్లుగా ఆలోచన ఉందిట.మరో వైపు జగన్ కూడా పై ఎత్తులు వేస్తున్నారు అంటున్నారు. ఆయన తన కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డిని కేంద్ర మంత్రిగా చూడాలని భావిస్తున్నారుట. గతంలో కేంద్ర ప్రభుత్వంలో చేరకూడదని జగన్ అనుకున్నా ఇపుడు రాజకీయ మారిన పరిస్థితుల నేపధ్యంలో కేంద్రంలో తమ వారు ఉండాల్సిందే అని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారని అంటున్నారు. రెండు పదవులు జగన్ కోరుతున్నారు అన్న ప్రచారం కూడా ఈ మధ్య ఆయన జరిగిపిన ఢిల్లీ పర్యటనలో కూడా వినిపించింది. ఒక క్యాబినేట్ మంత్రి, మరో సహామ మంత్రి వైసీపీకి ఇస్తారు అన్నది కూడా బీజేపీ నేతలు చెబుతున్న మాట.ఇక కేంద్ర మంత్రి వర్గ విస్తరణ అన్నది ఏపీలోని పలువురు ఎంపీలలో కొత్త ఆశలు రేపుతోంది అనే చెప్పాలి. వచ్చే ఏడాది రిటైర్ కాబోతున్న సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు కూడా ట్రై చేస్తున్నారు అంటున్నారు. ఇక బీజేపీలో ఎంపీగా ఉన్న జీవీఎల్ నరసింహారావు రేసులో ముందున్నారు. అలాగే ఆ పార్టీలో చేరి పెద్ద పదవుల కోసం ఎప్పటి నుంచో చూస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణ వంటి వారు కూడా ఎక్కడో ఒక చోట రాజ్యసభ సీటు ఇచ్చి మరీ కేంద్ర మంత్రిని చేయకపోతారా అని ఎదురుచూస్తున్నారుట. అయితే బీజేపీ జనసేన పొత్తు గట్టిగా ఉండాలంటే జనసేన నుంచి పవన్ ని ప్రొజెక్ట్ చేస్తూ కేంద్ర మంత్రి పదవిని ఆయనకు ఇస్తే లాభంగా ఉంటుందని ఒక సెక్షన్ ఆఫ్ పార్టీ అయితే సీరియస్ గా ఆలోచిస్తోందిట. మొత్తానికి అటు సాయిరెడ్డా, ఇటు పవన్ కళ్యాణా అన్నది తేలాల్సి ఉంది.

Related Posts