YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీ ప్లస్..ఎవరికి మైనస్

బీజేపీ  ప్లస్..ఎవరికి మైనస్

హైదరాబాద్, జూన్ 15, 
తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు మారనున్నాయి. త్రిముఖ పోటీ నెలకొనే అవకాశముంది. ఇప్పటి వరకూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఎదగనివ్వకుండా చూడటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఇక కాంగ్రెస్ తో తనకు ప్రమాదమేమీ లేదని కేసీఆర్ గ్రహించారు. నాయకత్వ లోపం, నాయకుల మధ్య విభేదాలు కాంగ్రెస్ కు ఎప్పుడూ కలసి రావు. అది కేసీఆర్ కు సానుకూలంగా మారనుంది. ఇక బీజేపీ తెలంగాణలో బలపడుతుంది. అనేక మంది నేతలు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే చూస్తున్నారు. చేరికలు కూడా బీజేపీలో ఎక్కువగానే ఉన్నాయి. అయితే బీజేపీ బలపడటం తనకు లాభమేనని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నారు. బీజేపీ కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పార్టీ. గత ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. రెండు, మూడు జిల్లాలు తప్పించి బీజేపీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.బీజేపీ ఎంత బలపడితే కాంగ్రెస్ అంత వీక్ అవుతుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా తనకు మరలే అవకాశముందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం లేక ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. బీజేపీ లో చేరడం ఇష్టం లేక అధికార పార్టీవైపు అనేక మంది కాంగ్రెస్ నేతలు మొగ్గు చూపుతున్నారు. బీజేపీలోకి నేతలు చేరుతున్నా అది అధికారంలోకి వచ్చే స్థాయిలో బలపడే అవకాశం లేదన్నది కేసీఆర్ అంచనా.అందుకే బీజేపీ ఎంత బలపడినా తనకు ఉపయోగకరమని కేసీఆర్ విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఇప్పుడు ఈటల రాజేందర్ వంగటి నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. మోదీ ప్రభుత్వంపై వెలువడుతున్న వ్యతిరేకత వచ్చే ఎన్నికల నాటికి మరింత తీవ్రమవుతుందని కేసీఆర్ అంచనా. అందుకోసమే బీజేపీ ఎంత బలపడినా తమకు వచ్చే నష్టం పెద్దగా లేదని కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ బలపడటం టీఆర్ఎస్ కు లాభమేనన్నది విశ్లేషకుల అంచనా.

Related Posts