YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఖబడ్డార్‌.. నారా లోకేశ్‌

ఖబడ్డార్‌.. నారా లోకేశ్‌

అనంతపురం, జూన్‌ 19

ఖబడ్డార్‌.. నారా లోకేశ్‌ హత్యారాజకీయాలు టీడీపీకే చెల్లు గ్రామాల్లో గొడవలను ముఖ్యమంత్రికి ఆపాదిస్తారా?  ఓడిపోయిన బాధలో లోకేశ్‌కు మతిభ్రమించింది మంగళగిరిలో ఓడిన నువ్వు దమ్ముగురించి మాట్లాడడమా ?  రాయలసీమను ఫ్యాక్షన్‌ ప్రాంతంగా చిత్రీకరిస్తే సహించం సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తాం  నారా లోకేశ్‌ను హెచ్చరించిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అనంతలో లోకేశ్‌ దిష్టిబొమ్మ దహనం.
ఖబడ్డార్‌ నారా లోకేశ్‌ అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామంటూ మండిపడ్డారు. హత్యారాజకీయాలు చేయడం తెలుగుదేశం పార్టీకే చెల్లుతుందని అన్నారు. సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం అనంతపురంలో వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌ వద్ద నుంచి టవర్‌క్లాక్‌ వరకు లోకేశ్‌ దిష్టిబొమ్మతో ప్రదర్శన చేసి టవర్‌క్లాక్‌ వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం అనంతపురం పార్లమెంట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సాకే చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలను రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. తెలుగుదేశం పార్టీకి కాలం చెల్లిందని, కేవలం పార్టీ మనుగడ కోసమే లోకేశ్‌  తరచూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఎంతో మంది హత్యకు గురయ్యారన్నారు. గడిచిన రెండేళ్లుగా సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందుతున్న సీఎం జగన్‌ను ఎలాగైనా అప్రతిష్టపాలు చేయడానికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ప్రయత్నిస్తున్నారన్నారు.  ఎప్పుడు.. ఎక్కడ ఏం జరుగుతుందా? దాన్ని జగన్‌కు ఎలా ఆపాదించాలా? అని లోకేశ్‌ ఆలోచనలు సాగుతున్నాయన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు.. 40 ఏళ్ల వయసున్న జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారన్నారు. అందుకే ప్రతి చిన్న ఘటనను రాజకీయంగా వాడుకుని లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు. జగన్‌ మగతనం ఏంటో చంద్రబాబుకు తెలుసని, కావాలంటే మీ నాన్నను వెళ్లి అడుగు అంటూ లోకేశ్‌కు చురకలంటించారు. వైసీపీ సీనియర్‌ నేత, ఒలంపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనంత చంద్రారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా, కనీసం ఎమ్మెల్యేగా గెలవకపోయినా మంత్రిగా పని చేసిన నారా లోకేశ్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవుపలికారు. హత్యారాజకీయాలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దూరమని.. అభివృద్ధి, సంక్షేమమే అంజెండాగా సీఎం జగన్‌ పరిపాలన చేస్తున్నారన్నారు. దీన్ని జీర్ణించుకోలేక ఎలాపడితే అలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని తెలిపారు. మేయర్‌ మహమ్మద్‌ వసీం మాట్లాడుతూ నారా లోకేశ్‌ ఓ రాజకీయ అజ్ఞాని అని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలకు మంచి చేయాలని తపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విమర్శించడం హేయనీయమన్నారు. ఇప్పటికే ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించారని.. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లో మార్పు రాకుంటే త్వరలోనే టీడీపీకి పాడెకడతారని అన్నారు. డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య మాట్లాడుతూ జనం అంతా అనుకుంటున్నట్లే లోకేశ్‌ ‘పప్పు’లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాను పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం పేరు కూడా సరిగ్గా పలకలేని లోకేశ్‌.. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం మంచిది కాదన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవుపలికారు. వైసీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో అనేక హత్యలు జరిగాయని, వాటిపై సీబీఐ విచారణ ఎందుకు వేయలేని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అనంతపురం జిల్లా పర్యటనలో ఉండగానే ఆత్మకూరులో వైసీపీ నాయకుడి హత్య జరిగిందని, టీడీపీ హయాంలోనే రాప్తాడులో ప్రసాద్‌రెడ్డి హత్య జరిగిందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు పాలనలో అనేక హత్యలు జరిగాయన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయామన్న బాధతో రెండేళ్లుగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఉనికికోసమే నీచ రాజకీయాలు పాల్పడుతున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో జగన్‌ను ఎదుర్కొనే దమ్ము లేక ఫ్యాక్షన్‌ రాజకీయాలను ప్రోత్సహించేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఏడాదిన్నరగా ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు, లోకేశ్‌ హైదరాబాద్‌లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమను ఫ్యాక్షన్‌ ప్రాంతంగా చిత్రీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్‌కు దమ్ము గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఒక్కడిగా వచ్చి 151 మంది ఎమ్మెల్యేలతో చరిత్రతిరగరాసేలా పరిపాలన చేస్తున్న జగన్‌ దమ్మున్న నాయకుడని అన్నారు. కొంతకాలంగా లోకేశ్‌కు మతిభ్రమించిందని, బహుశా అది గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం వల్ల వచ్చిందని ఎద్దేవా చేశారు. మరోసారి ముఖ్యమంత్రి జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మహిళా విభాగం అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షురాలు గిరిజమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించే అర్హత లోకేశ్‌కు లేదన్నారు. కనీస ఇంకితజ్ఞానం లేకుండా లోకేశ్‌ వ్యవహరిస్తున్నారని, ప్రతి విషయాన్ని సీఎం జగన్‌కు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మనిషిగా ప్రవర్తించాలని హితవుపలికారు. ఆందోళనలో మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, కార్పొరేటర్లు బాలాంజనేయులు, టీవీ చంద్రమోహన్‌ రెడ్డి, బోయ సుమతి, దేవి, లక్ష్మిదేవి, అనిల్‌కుమార్‌ రెడ్డి, సైఫుల్లాబేగ్, కమల్‌భూషణ్, రహంతుల్లా, సోనీరమణ, ఇసాక్, మైనార్టీ అధ్యయన కమిటీ సభ్యుడు కాగజ్‌ఘర్‌ రిజ్వాన్, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేన్‌పీరా, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి వేముల నదీం, వైసీపీ నేతలు కొండ్రెడ్డి ప్రకాశ్‌రెడ్డి, ఎద్దుల అమర్నాథ్‌రెడ్డి, శేఖర్, రాధాకృష్ణ, దాదాఖలందర్, దాదాపీర్, వడ్డే రామచంద్ర, గోపాల్‌మోహన్, గంగాధర్, సతీశ్, జేఎం బాషా, మిద్దెనగేశ్, బంగారు శీన, సురేంద్ర, శివ, లింగమయ్య, అంజి, కిరణ్, రాజు, తిక్కయ్య, అనిల్, కోడూరు రాము, కురుబ చంద్ర, మహిళా విభాగం నాయకురాలు రాధాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు

Related Posts