YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ ‎గా మార్పు... ఎంసెట్ షెడ్యూల్‎ విడుదల.. 24న నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ ‎గా మార్పు...  ఎంసెట్ షెడ్యూల్‎ విడుదల.. 24న నోటిఫికేషన్‌

అమరావతి జూన్ 19
 ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ షెడ్యూల్‎ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ ‎గా మార్చుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టుగా ఈఏపీ ‎సెట్‎ను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈనెల 24న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, జులై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వివరించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.
నోటిఫికేషన్ వివరాలు..
- జూన్ 24న నోటిఫికేష‌న్ విడుద‌ల,- జూన్ 26 నుంచి జూలై 25 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌,- జూలై 26 నుంచి ఆగ‌స్ట్ 5 వ‌ర‌కు 500 లేట్ ఫీజుతో అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌,- అగ‌స్ట్ 6 నుంచి 10 వ‌ర‌కు 1000 రుపాయిల లేట్ ఫీజు‌తో అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌,- అగ‌స్టు 11 నుంచి 15 వ‌రకు 5 వేల రుపాయ‌లు లేట్ ఫీజుతో అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌,- అగ‌స్టు 16 నుంచి 18 వ‌రకు 10 వేల రుపాయిలు లేట్ ఫీజుతో అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌,- ఆగ‌స్ట్ 19 నుంచి 25 వ‌ర‌కు ఈఏపీ సెట్ పరీక్షలు.ఇదిలా ఉంటే.. ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీసెట్, ఎంట్రెన్స్ టెస్ట్‌ల‌ను సెప్టెంబ‌ర్ మొద‌టి వారం లేదా రెండో వారంలో నిర్వహించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది.

Related Posts