YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆధార్ లింక్ లేకపోతే కష్టమే

ఆధార్ లింక్ లేకపోతే కష్టమే

హైదరాబాద్, జూన్ 21, 
మీకు పాన్ కార్డు ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఈ నెల చివరి కల్లా కచ్చితంగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఒకవేళ పాన్ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది.బ్యాంక్ కస్టమర్ల విషయానికి వస్తే.. పాన్ కార్డు అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్ అని చెప్పాలి. ఆధార్ పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు లేని బ్యాంక్ అకౌంట్‌గా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం పడుతుంది.బ్యాంక్ ఖాతా కలిగిన వారు వడ్డీ రూపంలో రూ.10 వేలకు పైగా పొందుతూ ఉంటే.. అప్పుడు టీడీఎస్ 10 శాతం కట్ అవుతుంది. పాన్ ఆధార్ లింక్ అయితే ఈ 10 శాతం కట్టాలి. ఒకవేళ పాన్ ఆధార్ లింక్ కాకపోతే డబుల్ టీడీఎస్ పడుతుంది. అంటే 20 శాతం టీడీఎస్ చెల్లించాల్సి వస్తుంది.ఇకపోతే పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే మరో ఇబ్బంది కూడా ఉంది. బ్యాంక్ కస్టమర్లు రూ.50 వేలు లేదా ఆపైన మొత్తాన్ని డిపాజిట్ చేస్తే.. రూ.10 వేల వరకు చార్జీలు చెల్లించుకోవాల్సి రావొచ్చు. పాన్ కార్డు చెల్లుబాటు కాకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Related Posts