YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

శివసేన ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుంది : ధాక్రే

శివసేన ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుంది : ధాక్రే

ముంబై, జూన్ 21,
ప్రధాని నరేంద్ర మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశం కావడంతో తిరిగి బీజేపీ, శివసేన మధ్య మైత్రికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని మహారాష్ట్ర పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు శివసేన అంతే ధీటుగా స్పందించింది. దీంతో సంకీర్ణ ప్రభుత్వంలో పూర్తికాలం మనుగడ సాగించలేదనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది.నేపథ్యంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని శివసేన, కాంగ్రెస్‌లు స్పష్టం చేశాయి. తాజాగా శివసేన నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఉద్ధవ్ ఐదేళ్లూ సీఎంగా ఉంటారని పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే సైతం ఆదివారం ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు.శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ కలిసి ఐదేళ్లూ ప్రభుత్వాన్ని నడపడటానికి కట్టుబడి ఉన్నాయి... అధికారం కోల్పోయిన తర్వాత కొంత మంది బయట వ్యక్తులు ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవిశ్రాంతిగా ప్రయత్నిస్తున్నారు.. కానీ, మా ప్రభుత్వం పూర్తికాలం ఉంటుంది.. ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేన మధ్య విభేదాలు సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పనిచేయవు’’ అని రౌత్ సోమవారం వ్యాఖ్యానించారు.మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే.. ఉద్ధవ్ ఠాక్రేకు తమ మద్దతు కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నుంచి ఎటువంటి సమస్య ఉండబోదని తెలిపారు. ‘‘బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి మహావికాస్ అఘాడీలో మా నేత సోనియా గాంధీ ఓ భాగం.. ఏదిఏమైనా మేము కూటమిలో శాశ్వతంగా ఉన్నామని ప్రస్తావించలేదు’’ అని అన్నారు.ఐదేళ్లూ ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ మద్దతు కొనసాగుతుంది.. కాబట్టి మా పార్టీతో కూటమిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.. మా నేత సోనియా గాంధీ భరోసా ఇచ్చారు.. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నా అభిప్రాయం కూడా అదే’’ అని నానా పటోలే కుండబద్దలుకొట్టారు. శివసేన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం సీఎం ఉద్ధవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు.మేము ప్రజా సమస్యలకు పరిష్కారాలను చూపకుండా రాజకీయాల్లో ఒంటరిగా వెళ్లడం గురించి మాత్రమే మాట్లాడితే వారు మమ్మల్ని చెప్పులతో కొడతారు. ఎన్నికలలో మాత్రమే పోటీ చేసే మా పార్టీ కేంద్రీకృత, ప్రతిష్టాత్మక చర్చను వారు వినిపించుకోరు’’ అంటూ పరోక్షంగా నానా పటోలే వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.

Related Posts