YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

లింగవివక్ష లేని సమాజ నిర్మానానికి కలిసికట్టుగా కృషి చేయాలి

లింగవివక్ష లేని సమాజ నిర్మానానికి కలిసికట్టుగా కృషి చేయాలి

హైదరాబాద్ జూన్ 25
అన్ని రంగాలలో సమాన ప్రాతినిధ్యం, సరైన నాయకత్వం సాధించడానికి,   లింగవివక్ష లేని సమాజాన్ని నిర్మించడానికి కలిసికట్టుగా కృషి చేయాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.మహిళ నాయకత్వాన్ని అన్ని రంగాలలోనూ ప్రోత్సహించాలని మహిళా సాధికారత,  సమానత్వం సాధించాలంటే, భిన్నత్వాన్ని, సమ్మిళిత సమాజాన్ని  సాధించాలంటే మహిళా నాయకత్వాన్ని అన్ని దశలలోనూ పెంపొందించాల్సిన ఆవశ్యకత  ఉందన్నారు.హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఉమెన్ లీడర్స్ ఫోరమ్ లో వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. కార్పొరేట్ రంగంలో, అలాగే వివిధ వ్యవస్థలలో సీనియర్ పొజిషన్ లలో మహిళా నాయకత్వం చాలా తక్కువ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.నిర్ణయాలు తీసుకునే నాయకత్వ బృందాలలో మహిళలు ఉండాల్సిన ఆవశ్యకత ఉందని అప్పుడే మహిళలకు సమాన ప్రాతినిద్యం దొరుకుతుందని, లింగ వివక్ష తగ్గుతుందని డాక్టర్ తమిళి సై వివరించారు.మొత్తం ఎంటర్ప్రెన్యూర్ లలో మహిళలు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నారని,  వారిలో  ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంపొందించడానికి మరింతగా కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు.ఆర్థిక రంగంలో, ఉద్యోగ రంగంలో మరింత ఎక్కువ మంది మహిళలు భాగస్వామ్యం అయినప్పుడు భారతదేశ జి డి పి ఎన్నో రెట్లు పెరుగుతుందని డాక్టర్ తమిళి సై  వివరించారు.ఇంతకాలం పురుషులకు మాత్రమే సొంతం అనుకున్న అనేక రంగాలలో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. అయినప్పటికీ

Related Posts