YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

టీకాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో చెప్పాలి: రాహుల్‌ గాంధీ

టీకాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో చెప్పాలి: రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ జూన్ 25
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో డెల్టా వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆయన మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. కొవిడ్‌-19 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వ్యాప్తిని తెలుసుకునేందుకు, నిరోధానికి పెద్ద ఎత్తున ఎందుకు పరీక్షలు చేయలేదని ప్రశ్నించారు. వేరియింట్‌కు వ్యతిరేకంగా టీకాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో చెప్పాలని, పూర్తి సమాచారం ఎప్పుడు లభిస్తుందన్నారు. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు నియంత్రించే ప్రణాళిక ఏంటీ? అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు.ఇదిలా ఉండగా.. ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరమయ్యే అవకాశం ఉందన్న అంచనాలతో కేంద్ర ప్రభుత్వం దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డెల్టా ఫ్లస్ వేరియంట్ మరింత శక్తివంతమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ డెల్టా ఫ్లస్ వేరియంట్ మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ ఔషధాన్ని తట్టుకుంటుందని, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయన్నారు. దేశంలో మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఆయా రాష్ట్రాలు బాధిత జిల్లాల్లో నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. డెల్టా లేదా B.1.617.2 వేరియంట్‌లోని మ్యుటేషన్ కారణంగా ఈ వేరియంట్ ఉత్పరివర్తనం చెందిందని.. అయితే దాని తీవ్రత ఇంకా తెలియదని నిపుణులు పేర్కొంటున్నారు.

Related Posts