YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కోర్ట్ మొట్టి కాయ వేస్తె గాని దిగిరాని జగన్ సర్కార్

కోర్ట్ మొట్టి కాయ వేస్తె గాని దిగిరాని జగన్ సర్కార్

అమరావతి జూన్ 25
పంతాలు, పట్టుదలలు మితి మీరితే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. పంతాలకు, పట్టింపులకు సడలింపులు ఉండకుంటే.. మొట్టికాయలు పడతాయి. పరువు ప్రతిష్టలు మంటగలుస్తాయని అనుభవంతో కానీ సిఎం జగన్‍ రెడ్డికి తెలిసిరాలేదు. పది, ఇంటర్‍ పరీక్షలను రద్దుచేయాలని ఎప్పటినుండో నారా లోకేష్‍ డిమాండ్‍ చేస్తున్న నేపధ్యంలో పరీక్షలు రద్దు చేస్తే.. ఆ ఘనత అంతా లోకేష్కేా దక్కుతుందన్న అనుమానంతో మొండిగా పరీక్షలు నిర్వహించాలనుకున్న జగన్‍రెడ్డికి సుప్రీంకోర్టు బలంగా మొట్టికాయ వేశాక కానీ.. తన నిర్ణయానికి వెనక్కి తీసుకున్నారు. పరీక్షలు రద్దు చేస్తే.. ఆ ప్రభావం సిఎం జగన్‍ రెడ్డికే దక్కుతుంది తప్ప మాజీ మంత్రి నారా లోకేష్కుా దక్కదని ఆయన తెలుసుకోలేకపోతున్నారు. ఎందరెందరో ఏవేవో డిమాండ్‍ చేస్తుంటారు. ఆ డిమాండ్లును ప్రభుత్వం అమలు చేస్తే.. ఇంత మంది కోరుకున్నారు. వారి కోరిక నెరవేర్చామని గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ లోకేష్‍ రాజకీయంగా ఎదిగారని.. జగన్‍ రెడ్డి పంతానికి, పట్టుదలకు పోయారు. అందుకు మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఎదురురావటంతో వెంటనే పంతాన్ని పక్కన పెట్టారు. ఇక అసలు విషయానికి వస్తే..22 రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్‍ పరీక్షలు రద్దు చేసినా.. మేము ఆ పరీక్షలు రద్దు చేయం.. జులైలో నిర్వహిస్తాం.. అని మొండి వైఖరితో సుప్రీంకోర్టులో అఫిడవిట్‍ దాఖలు చేయటంతో ఆగ్రహం చెందిన న్యాయమూర్తులు మీరు పరీక్షలు నిర్వహించాలనుకుంటూ.. ఏ ఒక్క విద్యార్ధి చనిపోయినా.. కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఏ విధంగా పరీక్షలు నిర్వహిస్తారో.. గదికి ఎంత మంది విద్యార్థులను కూర్చోపెడతారు.. ఎన్ని గదులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అఫిడవిట్‍ దాఖలు చేయాలని అని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సిఎం జగన్‍ రెడ్డికి నిన్నటి వరకు పైనున్న కళ్లు ఒక్కసారిగా కిందకి వచ్చాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వెంటనే మంత్రిని పిలిపించి మీడియా సమావేశం నిర్వహించి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. వాస్తవానికి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలు లేవు. విద్యార్ధులకు అందుబాటులో ఉండాల్సిన గదులు కూడా తక్కువగా ఉన్నాయి. అప్పటికి చూసుకోవచ్చు.. తాత్కాలికంగా ఇలా గడుపుదామనుకుంటే.. న్యాయస్థానం ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఒక విద్యార్ధి చనిపోయినా.. కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.. తస్మాత్‍ జాగ్రత్త అని ఉన్నత న్యాయస్థానం ఆదేశించటంతో.. అసలుకే ఎసరు వస్తుంది… కొంప మునుగుతుంది అన్న భయాందోళనతో పంతం వీడారు. పట్టుదలను పక్కన పెట్టారు సిఎం జగన్‍ రెడ్డి. ఇప్పటికైనా న్యాయస్థానాన్ని దిక్కరించినా… సూచనలు, సలహాలు పాటించకపోయినా.. పంతాలకు, పట్టింపులకు పోయి మొండిగా వ్యవహరిస్తే.. మొట్టికాలు పడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related Posts