YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పారదర్శకంగానే పన్ను విధానం

పారదర్శకంగానే పన్ను విధానం

పారదర్శకంగానే పన్ను విధానం
సమస్యల తక్షణ పరిష్కారం కోసం పర్యటన
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
గుడివాడ
ప్రజలను భయపెట్టేందుకు కావాలనే రాజకీయ పార్టీలు పన్ను విధానంపై దుష్టప్రచారం చేస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం మంత్రి, నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, 39 వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ  నరేంద్ర రఘవ మరియు అధికారులతో   క్వారీ సెంటరు (కుమ్మరిపాలెం రోడ్ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్)  సంజయ్ గాంధీ కాలనీ, కామకోటినగర్, గుప్తా సెంటరు తదితర ప్రాంతాలు పర్యటించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  ఈ ప్రాంతంలో డ్రైనేజి సమస్య పరిష్కారించాలని పబ్లిక్ హెల్త్ మరియు నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. పశ్చిమ లోని 22 డివిజన్లు మోడల్ డివిజన్లు గా అభివృద్ది చేస్తామన్నారు.  అనంతరం స్వచ్ఛా భారత్ లో భాగంగా మహిళలకు మూడు రకాల డస్ట్ బిన్ లను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె  కొన్ని రాజకీయ పార్టీలు  కావాలనే పన్ను  విధానంపై దుష్టప్రచారం చేస్తు, ప్రజలను భయందోళనకు గురిచేస్తున్నారన్నారు. ఎవరికి, ఎటువంటి ఇబ్బంది లేని పన్ను విధానం అమలు  చేయడం జరుగుతుందన్నారు. స్లాబ్ ప్రకారమే పన్ను  ఉంటుందన్నారు. అభివృద్దికి అందరూ సహకరించాలన్నారు. పన్ను విధానంలో లోపాలను సరిచేయడంతో పాటు పారదర్శకంగానే పన్ను విధానం  ఉంటుందన్నారు. కేంద్రంతో జతకట్టిన  జనసేన  అధ్యక్షులు పవన్కల్యాణ్ కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు.
ప్రభుత్వ నిర్ణయం- మేయర్
దేశంలో తమిళనాడు, కేరశ, మహారాష్ట్రా వంటి చాలా రాష్ట్రాలల్లో పన్ను విధానం అమలు జరుగుతుందని,  ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు గమనించాలని నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి .  విజయవాడ అభివృద్దికి సీఎం  నిధులు కెటాయించడంలో నగరం అభివృద్దిపధంలో దూసుకు వెళ్లుతుందన్నారు.. ఈ పర్యటనలో వైసీపీ శ్రేణులు,  వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.

Related Posts