YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటల రాజేందర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి

ఈటల రాజేందర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి

హైదరాబాద్
ఈటెల రాజేందర్ కు టీఆరెస్ ఎంత ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలి.  ఈటెల రాజేందర్ కు టీఆరెస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలి.  మంత్రిగా ఉండి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టారని మంత్రి కేటీఆర్అ న్నారు. బుధవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.   ఈటెల రాజేందర్ తప్ప చేయకుండానే ఒప్పుకున్నారా?   ఈటెల రాజేందర్ పై సానుభూతి ఎందుకు ఎట్లా వస్తది!.  బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలి?  ఈటెల పై అనామకుడు ఉత్తరం రాస్తే సీఎం చర్యలు తీసుకోలేదు.  ఈటెల రాజేందర్ ఆత్మ వంచన చేసుకుంటున్నారు.  ఐదేళ్ల కిందట నుంచి కేసీఆర్ తో గ్యాప్ ఉంటే ఎందుకు మంత్రిగా కొనసాగారు?  ఐదేళ్ల నుంచి ఈటెల రాజేందర్ అడ్డంగా మాట్లాడినా మంత్రిగా కేసీఆర్ ఉంచారు.  ఈటెల రాజేందర్ చివరి వరకు పార్టీలో ఉండాలని ప్రయత్నం నేను వ్యక్తిగతంగా చేసాను.  ఈటెల రాజేందర్ సీఎం ను కలువను అని స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత నేను ఎమ్ చేయగలను.    ఈటెల రాజేందర్ పార్టీలోకి రాకముందు కూడా కమలాపురం బలంగానే ఇప్పుడు కూడా హుజురాబాద్ బలంగానే ఉంది.  కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎమి ఇచ్చింది.  జల జీవన్ మిషన్ కు అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది- తెలంగాణ కు ఇవ్వడం లేదు.  టీఆరెస్ అభివృద్ధి బీజేపీ ఖాతాలో ఈటెల ఎలా వేసుకుంటారని ప్రశ్నించారు.

Related Posts