YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీఎస్సీసికి ప్రిలిమ్స్ రద్దు

ఏపీఎస్సీసికి ప్రిలిమ్స్ రద్దు

ఏపీఎస్సీసికి ప్రిలిమ్స్ రద్దు
విజయవాడ, జూలై 16, 
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు సంబంధించి జీవోలు 39, 150 లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇదే విషయాన్ని ఏపీపీఎస్సీ సభ్యులు సలాం బాబా తెలిపారు. గ్రూప్ 1 పోస్టులకు మాత్రం ప్రిలిమ్స్ నిర్వహిస్తామని చెప్పారు. అయితే, గ్రూప-1లో ఇంటర్వ్యూల స్థానంలో వేరే విధానాన్ని అమలు చేసేలా పరిశీలిస్తున్నట్లు సలాం బాబా వెల్లడించారు. ఆగస్టు నెలలో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఆగస్టు నుంచి ఏపీపీఎస్సీ అమలు చేస్తుందని ఆయన తెలిపారు. అయితే, అగ్రవర్ణ పేదలకిచ్చే రిజర్వేషన్లపై రోస్టర్ పాయింట్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉందన్నారు. 1,184 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని 47 ఏళ్ల వరకు పొడిగించాలన్న ప్రాతిపాదనలు ప్రభుత్వానికి వస్తున్నాయని, ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపామన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్‌లో మార్పులు చేయాల్సి ఉందన్నారు. ఇదిలాఉంటే.. గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనల్లో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సలాం బాబు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్లకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఈ 32 నోటిఫికేషన్లలో గ్రూప్-1, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోర్టులో ఉన్నందున వాటి నియామక ప్రక్రియ పెండింగ్‌లో ఉందని తెలిపారు

Related Posts