YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రగతి భవన్ ను కూడా అమ్ముతారా రేవంత్ రెడ్డి

ప్రగతి భవన్ ను కూడా అమ్ముతారా రేవంత్ రెడ్డి

హైదరాబాద్
కబ్జా ల నుంచి రక్షించడానికి భూమి అమ్మామని సీఎం చెప్తున్నారు. భూమి అమ్ముతున్నారంటేనే అర్దం అవుతుంది.. తెలంగాణ ధనిక రాష్ట్రమని. 2005-06సంవత్సరం లో ఇప్పుడు అమ్మిన భూముల పక్కనే ఉన్న భూములు ఎకరాకు 14,15కోట్లు పలికిందని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
ఆరోజు అమ్మగా మిగిలిన భూభులను ఈ రోజు అమ్మితే రెండు వేల కోట్లు వచ్చాయి..ఇది అద్బుతం అని కేసీఆర్ అంటున్నాడు. భవిష్యత్ లో ప్రజల అవసరం ఏదైనా నిర్మించాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి..ఎట్టి పరిస్థితులను ఈ భూముల ను అమ్మొద్దు అని తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. ఈ భూములు అమ్మే ముందు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెస్ట్ కంపెనీలు పెట్టుబడులు పెడతాయని ప్రభుత్వ పెద్దలు చెప్పారని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం లో ఈ భూములు అమ్ముతామంటే ...హెజ్ ఎండీఎ ముందు నిరసన వ్యక్తం చేసింది కేటీఆర్ కాదా. కోకాపేట్ భూముల ఆక్షన్ లో కేసీఆర్ బంధువులే  పాల్గొన్నారు. రామేశ్వర్ రావు కొడుకుల సొంత కంపెనీలే 18 ఎకరాల భూములు కొన్నారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కి చెందిన రెండు కంపెనీలు 9 ఎకరాల భూములను కొన్నాయి. ఓక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి ..నిబంధనల కు విరుద్ధంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో సీఎం కాళ్ళు మొక్కాడు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అల్లుడు కూడా ఈ భూములు కొన్నాడు. మహాబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడు మన్నె సత్యనారాయణ రెడ్డి 7 ఎకరాలు కొన్నడు. ప్రెస్టేజ్ కంపెనీ తో కేటీఆర్ కు చీకటి ఓప్పందాలు ఉన్నాయి. రాజేంద్రనగర్ బుద్వేల్ విలేజ్ లో ఏపీ ఐఐసీ నుంచి ప్రెస్టేజ్ కంపెనీ కొంటె  ఫ్లాట్లు చేసుకునేందుకు డబ్బులు తీసుకొని అనుమతి ఇచ్చారు. శ్రీచైతన్య , నారాయణ సంస్థలు కలిపి దాదాపు 7 ఎకరాల భూములను కొన్నారు. ఓకే భూమికి ఓక ఎకరాకు 60 కోట్లు పలికితే..మరో ఎకరాకు 40కోట్లు ఎలా పలుకుతుంది..ఇంత తేడా ఎందుకుంటుంది. దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు టెండర్లు వేయకుండా  సిద్దిపేట కలెక్టర్ ఫోన్ లు చేసి బెదిరించాడని ఆరోపించారు.
111జీవో పరిది దగ్గర లో ఉంది.. మీకు ఇబ్బందులు ఎదురవుతాయని కంపెనీలను  బెదిరించారు. ఈ టెండర్ల ద్వారా 400కోట్లు  మై హోం రామేశ్వర్ రావు కు  లాభం ప్రభుత్వం చేకూర్చింది. మొత్తానికి 1000కోట్లు కొనుగోలు దారులకు ప్రభుత్వం లాభం చేసింది. నేను గతంలో రియలెస్టేట్ చేసా..గజం ధర ఎంతో నాకు తెలుసు. ఎక్కడ ఎకరం 50 కోట్లకు తగ్గదని అన్నారు.
భవిష్యత్ లో 100కోట్లకు ఎకరం పోయినా ఆశ్చర్యపొనక్కర్లేదు. ఈ టెండర్లలో ఓక్కరు కూడా బయటివారు పాల్గొనలేదు. అవుటర్ రింగ్ రోడ్డు లేనప్పుడే గతంలో ఈ భూముల పక్కన ఉన్న భూములు అమ్మినప్పుడు అంతర్జాతీయ సంస్థలు ఆక్షన్ లో పాల్గొన్నాయి. ఇన్ని వసతులు వచ్చిన తర్వాత అంతర్జాతీయ సంస్థలు పాల్గొనలేదంటేనే అర్దం అవుతుంది. ఇన్ని రోజులు లిక్కర్ మాఫియా ను చూసాం..ఇప్పుడు ల్యాండ్ మాఫియా ను చూస్తున్నాం. స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా మళ్ళీ టెండర్లు పిలవాలని అన్నారు.
60కోట్లు పలికిన  ఆ ఎకరం ధర  ఆధారంగా టెండర్లు పిలవాలి. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి  రియలెస్టేట్ బాగోతం బయట పెడతాం. భూములను కొళ్ళగొట్టేందుకే కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ..కేసీఆర్ కు సాష్టాంగనమస్కారం చేసారు. ఖానామెట్ భూముల టెండర్ల పై కూడా స్టడీ చేస్తున్నాం..దాని వివరాలు బయటపెడతాం. కలెక్టరేట్ వెంకట్రామిరెడ్డి కంపెనీ..రాజ్ పుష్పా  సమ్మట్, ఆక్వా స్పేస్ ఇది మై హోం   రామేశ్వర్ రావు కంపెనీ. ఈ టెండర్లు రద్దు చేయాలి..స్విస్ ఛాలెంజ్ ద్వారా కొత్త  టెండర్లు పిలవాలి. దీనిపై పార్లమెంట్ లో మాట్లాడుతా..కిషన్ రెడ్డి కి ఫిర్యాదు చేస్తా. బీజేపీ అధ్యక్షుడికి ఈ వివరాలు ఇస్తా..జైలు పంపిస్తాడో లేదో చూస్తా. కబ్జా అయితనుకుంటె..ప్రగతి భవన్ కూడా అమ్ముతారా అని ప్రశ్నించారు.

Related Posts