YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అనుకున్నదొకటి...అయినొదక్కటి

అనుకున్నదొకటి...అయినొదక్కటి

ఒంగోలు, జూలై 19, 
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగిసింది. ఆయన ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు. ఒంగోలు రాజకీయాల్లో తిరిగి చక్రం తిప్పాలని వైవీ సుబ్బారెడ్డి భావిస్తున్నారు. తాను టీటీడీ ఛైర్మన్ గా వెళ్లినా ప్రకాశంతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పార్టీ లో ఆయన క్రియాశీలకంగానే ఉన్నారు. కానీ క్యాడర్ కు ఆయన న్యాయం చేయలేకపోతున్నారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంపైనే ఆయనకు బెంగ ఎక్కువ. ఈ పార్లమెంటు పరిధిలో తన అనుచరులను పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదు. టీటీడీ ఛైర్మన్ గా వారిని తాను సమాధానపరుస్తూ వస్తున్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైవీ సుబ్బారెడ్డి వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టారు. పదవుల విషయంలోనూ వారికి న్యాయం చేయలేకపోయానన్న బాధతో వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. దీంతో తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని వైవీ సుబ్బారెడ్డి భావిస్తున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ పై అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల వరకూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీలో ఉంటారా? లేదా? అన్నది కూడా డౌటే. మాగుంట పార్టీ నుంచి వెళ్లిపోతే వచ్చే ఎన్నికలలో ఒంగోలు లోక్ సభ నుంచి పోటీ చేయాలని వైవీ సుబ్బారెడ్డి భావిస్తున్నారు.అలా కాకుండా జగన్ తనకు రాజ్యసభ ఇచ్చినా ఓకే చెప్పడానికి వైవీ సుబ్బారెడ్డి రెడీగా ఉన్నారు. ఎలాగైనా ఒంగోలులో పోయిన గ్రిప్ ను తిరిగి పొందడానికి వైవీ సుబ్బారెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఒంగోలు పార్లమెంటు పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రతి రోజు ఒంగోలుకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటూ వైవీ సుబ్బారెడ్డి త్వరలో తాను రంగంలోకి దిగుతానని సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ఆయన అనుచరుల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. టీటీడీ ఛైర్మన్ గా రెండేళ్ల పాటు తాను ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు తేకుండా పనిచేశానని, జగన్ తనకు గౌరవమైన పదవినే ఇస్తారన్న నమ్మకం ఉందని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది.ఇస్తే తిరిగి టీటీడీ ఛైర్మన్ పదవి, లేకుంటే రాజ్యసభ తప్పించి మరో పదవిని వైవీ సుబ్బారెడ్డి ఆశించడం లేదు. ఇదే విషయాన్ని జగన్ కు కూడా ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇన్నాళ్లూ దైవసేవలో ఉన్నానని, తనకు ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించాలని జగన్ ను ఆయన కోరినట్లు తెలిసింది. ఇందుకు జగన్ కూడా సుముఖంగా ఉండటంతో వైవీ సుబ్బారెడ్డికి ఏ పదవి ఇస్తారన్నది పార్టీలో చర్చనీయాంశమైంది.

Related Posts