YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సండే మార్కెట్లలో కనిపించని కరోనా

సండే మార్కెట్లలో కనిపించని కరోనా

హైదరాబాద్, జూలై 19, 
ఇంకా కరోనా రక్కసి కోరలు విరగనే లేదు. జనాల్లో  విచ్చలవిడి లెక్కలేని తనం.. కరోనా మృతుల చితుల అరనే లేదు జనాల్లో ఇసుమంతైన భయం లేదు.. కరోనా కు ఎవరు అతీతులు కాదన్నా విషయం తెలిసి కూడా నగర వాసులు  కరోనాను లైట్ తీసుకుంటున్నారు... రెండో దశ మిగిల్చిన విషాదాలను మరిచి మూడో దశను రా రమ్మని ఆహ్వానిస్తున్నారు... మాస్కులు మరిచారు భౌతిక దూరాన్ని విస్మరించి  సండే మార్కెట్లకు ఎగబడుతున్నారు. రద్దీ  ప్రాంతాల్లో  కరోనా వాయువేగంగా విస్తరిస్తోంది... అందుకే ప్రభుత్వం సమూహాలపై ఆంక్షలు విధించింది.. కరోనా రెండోదశ కాస్త నెమ్మదించడంతో ప్రభుత్వం రద్దీ ప్రదేశాలపై ఆంక్షలు ఎత్తివేసింది... ఆంక్షలు ఎత్తి వేసిన కూడా బౌతినా దూరం, మాస్క్ లు తప్పనిసరి చేసింది.. కానీ ఎక్కడ ఎవరికి కరోనా ప్రోటోకాల్ పట్టడం లేదు.. ఇక మార్కెట్లలో అయితే కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు. సండే మార్కెట్లలో  రద్దీ కరోనా కన్నా ముందు రోజులను తలపిస్తున్నాయి.. అమీర్పేట్ లోని ఫిష్ మార్కెట్ వద్ద చేపలు కొనడానికి జనం ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు. పూలు పళ్లు పూజ సామగ్రి వస్తువు ఏదైనా కూకట్ పల్లి ఫ్లవర్ మార్కెట్ లో ఇట్టే దొరుకుతుంది.. అందుకె ఈ మార్కెట్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది.. ఇక వారంతాల్లో అది కూడా ఆదివారం ఈ రద్దీ రెట్టించి ఉంటుంది.. పూలు పళ్ళు కొనడానికి వచ్చే వారితో కిటకిటలాడుతూ ఉంటుంది... రోడ్డుకిరువైపుల షాపులు ఉండటంతో అటు వాహనదారులు ఇటు కొనుగోలుదారులతో మార్కెట్ ఫుల్ రష్ గా ఉంటోంది.లేయర్, బ్రాయిలర్ అనే తేడా లేదు.. నాటు కోళ్లు, కడక్ నాథ్ కోళ్లు అనే భేదం లేదు.. రకమేదైన కూకట్ పల్లి మార్కెట్ లో లభ్యమౌతుంది.. ఆదివారం పూట మాంసం ప్రియులు కూకట్ పల్లి మార్కెట్ కు ఎగబడతారు..  తోసుకుంటు తన్నుకుంటు మాంసం కోసం చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు.. ఈ క్రమంలో వారు  కరోనా లాంటి వైరస్  ఒకటి ఉందన్న విషయమే మరిచి మాస్క్ లు లేకుండా మాంసం కోసం పోటీ పడుతున్నారు..  మరోవైపు మాంసం అమ్మే వ్యాపారస్తులు కూడా మాస్కులు తీసి తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కూకట్ పల్లి రైతు బజార్ ఆదివారం జన జాతరను తలపిస్తోంది.  దూరం నుండి మార్కెట్ ను చూస్తే ఏదో ఉత్సవం జరుగుతున్న భావన కలుగుతుంది.. ఉదయం పూట ఇసుక వేస్తే రాలనంత జనం కూకట్ పల్లి రైతు బజార్ కు కాయగూరలు కొనడానికి ఎగపడుతున్నారు... కూరగాయలు కొనే క్రమంలో మాస్క్ లు వదిలేస్తున్నారు . బౌతిక దూరానికి తిలోదకాలు ఇస్తున్నారు.. చిన్నపాటి స్థలం కావడంతో రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ఒకరిని ఒకరు తోసుకుంటూ నిత్యావసరాలు కొంటున్నారు. కూకట్ పల్లి రైతు బజార్ లో ఎప్పటికప్పుడు  రద్దీ నియంత్రణ చర్యలు చేపడుతున్నాం అని రైతు బజార్ ఈవో చెప్తున్నారు.. రద్దీ ఎక్కువ అయితే బౌతిక దూరం పాటించేలా మైక్ ల ద్వారా కొనుగోలుదారులను అలెర్ట్ చేస్తున్నామని అంటున్నారు..  మాస్కులు పెట్టుకోకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నా  విక్రయందారులపై తప్పక చర్యలు ఉంటాయని అంటున్నారు..ఒకప్పుడు ఎవరి ఆరోగ్యం వారికి ముఖ్యం ఇపుడు అలా కాదు కరోనా కాలంలో పక్కవాడు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా మనుగడ సాగించగలం.. అందుకే మాస్కులు దరిస్తూ భౌతిక దూరం పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూనే పక్క వారిని సంరక్షించిన వారం అవుతాము. ఇకనైనా కరోనా రెండో వేవ్ సృష్టించిన బీభత్సమ్ మరల వద్దు అనుకుంటే అందరూ మాస్కులు ధరించడంతో భౌతిక దూరాన్ని పాటించాలి.. సండే మార్కెట్ల లాంటి రద్దీ ప్రదేశాలపై అధికారులు దృష్టి సారించి జనం గుమిగూడకుండా తగిన చర్యలు చేపట్టాలి..

Related Posts