YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మందస్తూ ఊహాజనితాలే

మందస్తూ ఊహాజనితాలే

హైదరాబాద్, జూలై 19, 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి అంచనాలకు అందరు. ఆయన మదిలో ఏముందో ఎవరికీ తెలియదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. కానీ అంతా వట్టిదే. కేసీఆర్ ఆ పని ఈసారి చేయరు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. అయితే కేసీఆర్ స్పీడ్ చూసి విపక్షాలు సయితం ముందస్తు ఎన్నికలు వస్తాయని, ఆయన హడావిడి అందుకేనని భావిస్తున్నాయి.ఎన్నికలకు ఇప్పటి పరిస్థిితికి తేడా ఉంది. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ఇతర పార్టీల నేతలను చేర్చుకున్నారు. అప్పట్లో సరైన బలం లేదు. మరోవైపు మోదీ ఇమేజ్ అప్పుడు బాగా ఉంది. పార్లమెంటు ఎన్నికలతో కలసి వెళితే తాను దెబ్బతింటానని కేసీఆర్ ఊహించి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గతం కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుని మరింత బలోపేతమయ్యారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 2023లో జరగనున్నాయి. గతంలో మోదీ జమిలి ఎన్నికల ఆలోచన చేశారు. ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నారు. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ చతికల పడటం, కరోనా సెకండ్ వేవ్ తర్వాత మోదీ ఇమేజ్ దారుణంగా పడిపోవడంతో జమిలి ఎన్నికల ఊసే లేదు. దీంతో పార్లమెంటు ఎన్నికలు 2024లోనే జరుగుతాయి. అందువల్ల కేసీఆర్ ముందస్తు ఆలోచన ఉండదంటున్నారు.
అయితే బీజేపీ నుంచి ప్రమాదం పొంచి ఉందన్నది కేసీఆర్ కు తెలియంది కాదు. అందుకే రెండేళ్ల ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించారు. జిల్లాల పర్యటనలు చేస్తూ వరస హామీలు ఇస్తున్నారు. 58 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు, చేేనేత కార్మికులకు బీమా సౌకర్యం వంటి హామీలను గుప్పిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. హ్యాట్రిక్ విజయం దక్కాలంటే రెండేళ్ల ముందు నుంచే పార్టీ నేతలను, క్యాడర్ ను యాక్టివ్ చేయడానికి, ప్రజలకు దగ్గరయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎన్నికల వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. అంతే తప్ప గులాబీ బాస్ ఈసారి ముందస్తు ఆలోచనే చేయరన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Related Posts