YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గుత్తాపల్లిలో స్పీకర్ తమ్మినేని పర్యటన

గుత్తాపల్లిలో స్పీకర్ తమ్మినేని పర్యటన

గుత్తాపల్లిలో స్పీకర్ తమ్మినేని పర్యటన
శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం గుత్తావల్లి గ్రామంలో పలు అభివృద్ధి  పనులకు శాసన సభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. ముందుగా జగనన్న పచ్చతోరణం హరితవనహారం లో భాగంగా లాభం నుండి గుత్తావల్లి వెళ్ళే  రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గుత్తా వల్లి గ్రామం లో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అదే గ్రామంలో బల్క్ మిల్క్ కూలింగ్  సెంటర్ కు శంకుస్థాపన చేశారు. చివరగా జగనన్న కాలనీలో  ఇల్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ పాలనా వ్యవస్థ కు జీవం పోస్తూ ప్రతి రెండు  పంచాయతీలను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి  అక్కడే సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, బల్క్ కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్లు ను పెట్టి పాలనా వ్యవస్థను అందుబాటులో ఉంచిన ఘనత భారతదేశంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానిదే  ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పారు అవినీతి లేని పారదర్శకమైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పి స్వపరిపాలన కు నాంది పలికిన ఒక గొప్ప ముఖ్యమంత్రి ప్రగతి రథ సదాకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి  క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా అవినీతి లేని పాలన అందిస్తున్నారు విజ్ఞానవంతమైనటువంటి సమాజ నిర్మాణంలో వ్యవసాయదారుడు నిలబడాలని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సలహాలు,సూచనలు అందించి అధునాతన వ్యవసాయ పద్ధతుల ద్వారా నిలదొక్కుకునే విధంగా ప్రభుత్వం అండగా ఉంటుంది. పల్లెలను ప్రగతి పథంలో నడిపించిన నాడు  నిజమైన ప్రభుత్వమని స్పీకర్ తమ్మినేని అన్నారు.

Related Posts