YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాజీనామా చేయడంలేదు

రాజీనామా చేయడంలేదు

బెంగళూరు
కర్ణాటక రాజకీయాలు సీఎం యాడి యురప్ప చుట్టూ చక్కర్లు కొడుతున్న యి. బీఎస్ యడియూరప్పను ముఖ్య మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నారం టూ వార్తలు చెక్కర్లు కొడుతున్న తరు ణంలో గత రెండు రోజుల క్రితం సీఎం ఢిల్లీ పర్యటన మరిన్ని ఊహాగానాలకు తెరతీసింది.  ఢిల్లీ పర్యటనకు వెళ్లిన యడియూరప్ప కేంద్ర పెద్దలను కలిశారు. ఈ సందర్బంగా ఆయన రాజీనామా ప్రస్తావన వచ్చినట్లు వార్తలు వచ్చా యి.ఇదిలా ఉంటే యడియూరప్ప జూలై 26న తన పదవికి రాజీనామా చేస్తారని కర్ణాటక వ్యక్తంగా ఊహాగా నాలు బలంగా వినిపిస్తున్నాయి. అదే రోజు కర్ణాటక ఎమ్మెల్యేలు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక ఇదే విషయంపై గత వారం ఢిల్లీ పర్యట నకు వెళ్లిన సమయంలో యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. తనను కేంద్ర పెద్దలు సీఎంగా కొనసాగాలని కోరారని తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాలను కలిశానని.. తమ మధ్య అసలు రాజీనామా ప్రస్తావనే రాలేదని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించామని తెలిపారు. కాగా 2023లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే 79 ఏళ్ల యడియూ రప్పని తప్పించి యువనాయకుడికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని రాష్ట్రంలోని కొందరు నేతలు కోరుతు న్నట్లు తెలుస్తుంది. కేంద్ర పెద్దలు కూడా యడియూరప్పను తప్పించాలని చూస్తున్నట్లుగా సమాచారం. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Related Posts