YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా

బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా

హైదరాబాద్
మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహ బీజేపీకి రాజీనామా చేసారు. ఈ నేపధ్యంలో అయన మాజీమంత్రి ఈటలపై తీవ్ర విమర్శలు చేసారు. మరోవైపు,  ముఖ్యమంత్రి కేసీఆర్ పై  అయన ప్రశంసలు కురిపించారు. అంబేడ్కర్ కు నిజమైన వారసుడు సీఎం కేసీఆర్. దళితులకు పది లక్షలు ఇస్తోన్న ఏకైక మగాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావని కొనియాడారు. రాష్ట్రంలోని దళితులందరూ కేసీఆర్ కు అండగా నిలవాలి. అవమానాలు బరించలేకనే బీజేపీకి రాజీనామా చేస్తున్నాననని మోత్కుపల్లి అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఏ నాయకుడు బీజేపీలో సంతృప్తిగా లేరు.పార్టీ సమావేశాల్లో 30ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న నన్ను వేదిక కింద కూర్చో పెడ్తున్నారు. బలుపెక్కి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ను బీజేపీ మోయాల్సిన అవసరం ఏంటి? అవినీతిపరుడైన ఈటల రాజేందర్ ను హుజురాబాద్ ప్రజలు బహిష్కరించాలని అయన అన్నారు.  దళిత, దేవలయాల భూములను వెనక్కి ఇప్పించి పార్టీలో చేర్చుకుంటే బాగుండేది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి దళిత సాధికారత సమావేశానికి ఆహ్వానిస్తే వెళ్తే తప్పేంటి?   చరిత్రాత్మకమైన దళిత సాధికారత సమావేశానికి హాజరుకాకుండా బీజేపీ చారిత్రాత్మమైన తప్పుచేసిందని అయన అన్నారు.

Related Posts