YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జిఓ నెంబర్ 3 పునరుద్ధరణ చట్టబద్ధత కల్పించాలి

జిఓ నెంబర్ 3 పునరుద్ధరణ చట్టబద్ధత కల్పించాలి

విశాఖపట్నం,  జిఓ నెంబర్ 3 పునరుద్ధరణ చట్టబద్ధత కల్పించాలి గిరిజన సంఘం నాయకుడు కె.రామారావు డిమాండ్
అరకులోయ మండల తహసీల్దార్ కార్యాలయంలో  గిరిజన సంఘం నాయకులు జీఓ3 పునరుద్ధరణ చట్టబద్దత చేయాలని   గిరిజనులకు నూరు శాతం ఉద్యోగం ఇవ్వాలని. గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ తో కూడిన జాబ్ క్యాలెoడర్ ప్రకటన చేయాలి. ,టిఎసి తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి .జిఓ నెంబర్ 3 రిజర్వేషన్ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదంగా జారీచేసిన మెమో ను వెంటనే రద్దు చేయాలని అరకు వేలి తాసిల్దార్ కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో విద్య అభివృద్ధి కోసం మాతృభాష తో పాటు విద్య అభివృద్ధి చేయాలని 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 తీసుకువచ్చి  గిరిజనులకు 100% ఉద్యోగం కేటాయించేవారు దాని ఫలితంగా గిరిజన ప్రాంతంలో విద్య అభివృద్ధి చెందింది. 5షెడ్యూల్ ఏరియాలో వెనుకబడిన తరగతులకు రాజ్యాంగంలో కల్పించబడిన ప్రత్యేక చట్టాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది  . రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిఓ నెంబర్ త్రీ సుప్రీంకోర్టు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ,దీనివలన గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయి జిఓ నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలని ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది, జిఓ నెంబర్ 3 పై ప్రభుత్వం తక్షణమే స్పందించి చట్టబద్ధత కల్పించాలి .ఆదివాసి గిరిజనులకు ప్రత్యేక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి , విశాఖ ఏజెన్సీలో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్పించాలని డిమాండ్  చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి పాంగి రామన్న,  కొర్రా మగ్గన్న ,సిఐటియు జిల్లా కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు,కె. మార్కండ్ రావు, జయో తదితరులు పాల్గొన్నారు.

Related Posts