YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 డీసీఎంఎస్ చైర్మన్ గా 2వసారి ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన వీరి చలపతిరావు

 డీసీఎంఎస్ చైర్మన్ గా 2వసారి ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన వీరి చలపతిరావు

 డీసీఎంఎస్ చైర్మన్ గా 2వసారి ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన వీరి చలపతిరావు
 నెల్లూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల చైర్మన్ పదవులను భర్తీ చేసింది. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా నుండి 2వ సారి డి సి ఎం ఎస్ చైర్మన్గా వీరి చలపతిరావు నియామకం కాబడ్డారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక స్టోన్హౌస్పేట ప్రాంతంలో ఉన్న డీసీఎంఎస్ కార్యాలయంలో శుక్రవారం అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు, శాసనసభ్యులు , అధికారులు, పార్టీలోనే సన్నిహితుల సహకారం తో మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2వ సారి డీసీఎంఎస్ చైర్మన్ గా పదవి అధిరోహించడం హర్షణీయమన్నారు. తనపై నమ్మకంతో కట్టబెట్టిన పదవి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ నెల్లూరు జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ సంస్థను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేవిధంగా తనవంతు కృషి చేస్తానన్నారు. తాను తొలిసారి డీసీఎంఎస్ చైర్మన్ పదవి పొందే నాటికి 35 లక్షల బకాయిలతో డీసీఎంఎస్ ఉండేదన్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ మరియు శాఖ అధికారులతో పాటు మంత్రులు, శాసన సభ్యుల సహకారంతో 2 కోట్లు ఆదాయానికి తీసుకు రావడం జరిగిందన్నారు. ప్రస్తుత తన పదవీ కాలం సమయంలో నెల్లూరు నగరం నవాబుపేట ప్రాంతంలో ఉన్న 1.26 ఎకరాల స్థలములో డీసీఎంఎస్ భవన సముదాయాలను , జిల్లా పరిధిలోని ఆత్మకూరు పట్టణంలో ఉన్న డిసిఎంఎస్ స్థలంలో కూడా వ్యాపారాలకు సంబంధించిన భవన నిర్మాణాలను చేపట్టేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఇందుకుగాను జిల్లా మంత్రులు అనిల్ కుమార్, గౌతమ రెడ్డిల సహకారం తో పాటు జిల్లా శాసన సభ్యుల తోడ్పాటు ఉండాలని కోరారు. ఈ సందర్భంగా పాలకమండలి సభ్యులుగా దాసరి భాస్కర్ గౌడ్ , కాసారం రంగనాథం , ఉగ్గుముడి భాగ్యలక్ష్మి, గునుపాటి సురేష్ రెడ్డి , ఖిల్జీ సలీం , గండవరం సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి  బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మాత్యులు పి .అనిల్ కుమార్ యాదవ్ , కోవూరు నియోజకవర్గం సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ , ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ కుమార్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts