YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 నాల్గవ రోజు పార్లమెంట్ లో అంతే

 నాల్గవ రోజు పార్లమెంట్ లో అంతే

 నాల్గవ రోజు పార్లమెంట్ లో అంతే
న్యూఢిల్లీ, జూలై 23,
పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టుచేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తన సొంత ఫోన్ కూడా ట్యాపింగ్ కి గురైందని, తాను ప్రతిపక్ష నేతనని, ప్రజావాణిని వినిపించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇది ప్రజావాణిపై దాడేనని ఆరోపించిన అయన హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కోరారు. ప్రధాని మోదీఫై కూడా సుప్రీంకోర్టు విచారణ అవసరమేనని వ్యాఖ్యానించారు., ఇండియా పైన, ఈ దేశ సంస్థలపైన ఈ స్పై వేర్ ని ప్రధాని, హోమ్ మంత్రి ప్రయోగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది దేశ ద్రోహం కిందికే వస్తుందన్నారు. ఇజ్రాయెల్ టెర్రరిస్టులపై ఓ ఆయుధంగా వాడేందుకు దీన్ని( పెగాసస్ ను) ఉపయోగిస్తుంటే మన దేశంలో దీన్ని ఇండియన్స్ పైన, ఇక్కడి సంస్థలపైనా ఆయుధంగా వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తానేమీ భయపడడం లేదని, అవినీతిపరులు, దొంగలు మాత్రమే భయపడుతారని ఆయన వ్యాఖ్యానించారు. పెగాసస్ పై విచారణకు భయమెందుకని ప్రశ్నించారు. ముఖ్యంగా కర్ణాటకలో ఈ ‘ఆయుధాన్నీ’ ప్రయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు .అయితే రాహుల్ గాంధీ డిమాండును ప్రభుత్వం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు విచారణ అవసరం లేదని, , రాజకీయంగా విఫలమైన వారు దీన్ని ఓ సమస్యగా చూపుతున్నారని, అసలు ఇది సమస్యే కాదని హోమ్ శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ అన్నారు. ఈ విషయాన్నీ ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసిందన్నారు.. కాగా పార్లమెంటులో ఈ అంశాన్ని మళ్ళీ విపక్ష సభ్యులు ప్రస్తావించారు. గత మూడు రోజులుగా ఈ వివాదం ఉభయ సభలనూ కుదిపివేస్తోంది.

Related Posts