YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఆగస్టు 6 వరకు ఖాళీ చేయించవద్దు

 ఆగస్టు 6 వరకు ఖాళీ చేయించవద్దు

 ఆగస్టు 6 వరకు ఖాళీ చేయించవద్దు
విజయవాడ, జూలై 23,
ఏపీ సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి సమీపంలోని అమరా రెడ్డి కాలనీ ఇళ్ల కూల్చివేత పంచాయితీ హైకోర్టుకు చేరింది. సీఎం సెక్యూరిటీ పేరుతో కాలనీని ఖాళీ చేయించే పనులు ముమ్మరంగా సాగుతుండగా బాధితులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇళ్లని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని.. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ అధికారులు జేసీబీలతో ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ సంకరు రాజేష్, మరో 25 మందితో మూడు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ డి.రమేష్ పిటిషన్లపై విచారణ చేపట్టారు.కాలనీలోని 321 కుటుంబాల్లో సుమారు 240 కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి స్వచ్ఛందంగా వెళ్లిపోయారని.. వారికి నష్టపరిహారం కూడా చెల్లించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం అర్హులందరికీ ఇంటి స్థలం కూడా మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిటిషన్‌దారులకి ప్రత్యేకంగా తాత్కాలిక ఇళ్లని కేటాయిస్తే మిగిలిన వారు కూడా కోర్టుని ఆశ్రయించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఇళ్లు ఖాళీ చేసేందుకు వారం రోజులు సమయం ఇస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.ప్రభుత్వ వాదనలపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. కాలనీలోని 240 మంది ఖాళీ చేసి వెళ్లారనడంలో వాస్తవం లేదన్నారు. ఇళ్లు ఖాళీ చేసేందుకు కనీసం 2 లేదా 3 నెలల సమయం కావాలని.. వారికి కేటాయించిన స్థలంలో కనీసం షెడ్డు వేసుకునేందుకైనా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లకు రెండు వారాల సమయం ఇస్తున్నామని.. ఈలోగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ప్రభుత్వానికి సూచించింది. అప్పటిలోగా ఇళ్లు ఖాళీ చేసి అధికారులకు సహకరించాలని పిటిషనర్లను ఆదేశించింది. ఇంటి స్థలం.. నష్టపరిహారం కూడా ఇవ్వలేదని దాఖలైన మూడు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Related Posts