YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వైద్యశాలకు కేటాయించిన భూమిలో ఆక్రమణలు జరగకుండా చూడాలి

వైద్యశాలకు కేటాయించిన భూమిలో ఆక్రమణలు జరగకుండా చూడాలి

వైద్యశాలకు కేటాయించిన భూమిలో ఆక్రమణలు జరగకుండా చూడాలి
టీఎన్ఎస్ఎఫ్,తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో
డీఎంహెచ్ఓ కు వినతిపత్రం
కామారెడ్డి జూలై 27
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఐదు ఎకరాల భూమిని 100 పడకల వైద్యశాల నిర్మాణం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు కేటాయించడం జరిగింది కేటాయించిన ఈ భూమి సరిహద్దులలో కి బిల్డర్లు నూతనంగా నిర్మిస్తున్న ఇండ్లు నిర్మాణాలు వైద్య కళాశాల కు కేటాయించిన భూమి లోకి చొచ్చుకు రావడం జరిగిందని డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ దృష్టికి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ లు తెలియజేశారు. ప్రత్యక్షంగా కళాశాల భూమిని పరిశీలించి సర్వే అధికారులతో సర్వే నిర్వహించి, వైద్య శాలకు కేటాయించిన భూమి ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నాయకుల అండతో కొందరు బినామీలను సృష్టించి మరియు గతంలో చేసిన లేఅవుట్ లో ఉన్న ఖాళీ స్థలాలను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటిని ఇతరులకు అమ్మడం జరుగుతుందని వాటిలో నిర్మాణాలను కూడా నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందన్నారు అధికారులు స్పందించి ఇలాంటివి రిజిస్ట్రేషన్లు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.డిగ్రీ కళాశాలకు చెందిన అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం అయినా మరొకమారు ఆందోళన బాట పట్టడానికి విద్యార్థి సంఘాలు ముందుంటామని కబ్జాదారులను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చెట్టబోయిన స్వామి రాజు నవీన్ సతీష్ మహేష్ పాల్గొన్నారు

Related Posts