YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

పీవీ సింధు కొత్త చరిత్ర

పీవీ సింధు కొత్త చరిత్ర

టోక్యో ఒలింపిక్స్‌.. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో కంచు మోగించింది పీవీ సింధు. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఇద్దరు ప్లేయర్స్‌ మధ్య కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో సింధు ఘనవిజయం సాధించింది. నిన్నటి లోపాలను సరిదిద్దుకొని సింధు చైనా షట్లర్‌ బింగ్‌ జియావోపై అవలీలగా గెలిచింది.

పీవీ సింధు కాంస్యం పతకం అందుకుంది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పీవీ సింధు చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోపై ఆదినుంచి అధిపత్యం చెలాయించింది. పదునైన ఏస్ లతో ర్యాలీలతో విరుచుకుపడింది. మొదటి సెట్ ను 21-13 తేడాతో పీవీ సింధు సొంతం చేసుకుంది. రెండో సెట్ లో కూడా హోరాహోరీగా తలపడింది. రెండో సెట్ లో బింగ్‌ జియావో పై ఆధిపత్యం కొనసాగించింది.  21-15 తేడాతో గెలిచి.. మ్యాచ్ తో పాటు టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం అందుకుంది. దీంతో భారత రెండో పతకం లభించింది.

సింధు, బింగ్‌ జియావో మధ్య ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరగ్గా… సింధు 6 సార్లు, జియావో 9 సార్లు నెగ్గింది. దీంతో పీవీ సింధు రెండు ఒలంపిక్స్ లో రెండు వ్యక్తిగత పతకాలను సాధించిన మొదటి భారతీయ మహిళాగా రికార్డ్ సృష్టించింది. గత రియో ఒలంపిక్స్ లో రజతం గెలిచిన సంగతి తెలిసిందే.

ఇక ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారతీయుడు రెజ్లర్ సుశీల్ కుమార్. అతను 2008 బీజింగ్‌లో జరిగిన క్రీడలలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అనంతరం లండన్ గేమ్స్‌లో రజత పతకాన్ని సాధించాడు, దేశంలో ఏకైక రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయ్యాడు. ఇప్పుడు సుశీల్ తర్వాత తెలుగు తేజం సింధు ఈ ఖ్యాతిని సొంతం చేసుకుంది.

Related Posts