YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆడపడుచులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

ఆడపడుచులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

ఆడపడుచులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
కళ్యాణ లక్ష్మీ , ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
కోరుట్ల ఆగస్టు 11
తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు అండగా ఉంటుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ, మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ , ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మీ 8 మంది లబ్ధిదారులు 8,00928 (ఎనిమిది లక్షల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు)విలువ గల చెక్కులు, అలాగే ముఖ్యమంత్రి సహయనిధి 23 మంది లబ్ధిదారులకు  7,69,500 (ఏడు లక్షల అరవై తొమ్మిది వెయిల ఐదు వందల రూపాయలు) విలువ గల చెక్కులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేతులమీదుగా పంపిణీ చేశారు.ఆనంతరం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని,కళ్యాణలక్ష్మీ , షాదీ ముబారక్ పథకాలను దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు.ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందన్నారు .
ఈ మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్,ఎంపీపీ అధ్యక్షులు తోట నారాయణ,తెరాస పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, కౌన్సిలర్లు జిందం లక్ష్మీనారాయణ, అన్వర్, మండల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts