YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాట ఇక్కడ... మనసు అక్కడ

మాట ఇక్కడ... మనసు అక్కడ

గుంటూరు, ఆగస్టు 13, 
2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల్లో న‌లుగురు నేత‌లు.. పార్టీకి దూర‌మైన విష‌యం తెలిసిందే. కార‌ణాలు ఏవైనా.. కూడా వైసీపీకి చేరువ‌య్యారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ బ‌ల‌మైన స్థానాలు పోగొట్టుకుంది. అలాంటిది 23 మంది ఎమ్మెల్యేల‌ను మాత్రమే గెలిపించుకుంది. అయితే.. ప‌ట్టుమ‌ని రెండేళ్లు కూడా తిర‌గ‌ముందే.. టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న వారిలో న‌లుగురు పార్టీకి దూర‌మ‌య్యారు. వీరిలో కృష్ణా జిల్లా గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణమూర్తి, గుంటూరు జిల్లా గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ ఉన్నారు.
అదేవిధంగా విశాఖ ప‌శ్చిమ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కూడా టీడీపీకి దూర‌మై.. వైసీపీకి చేరువ‌య్యారు. స‌రే.. ఇంత వ‌రకు బాగానే ఉన్నప్పటికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారినా.. లేక జ‌గ‌న్‌కు కేసులు త‌దిత‌రాల నుంచి అవాంత‌రాలు ఏర్పడినా.. ఇప్పుడు ఆ పార్టీకి చేరువైన‌.. ఈ న‌లుగురులో ఎంత మంది వైసీపీకి అనుకూలంగా ఉంటారు ? ఎంత‌మంది.. మ‌ళ్లీ సైకిల్ ఎక్కేస్తారు ? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. ఈ క్రమంలో వీరిని వ్యక్తిగ‌తంగా తీసుకుని ప‌రిశీలిస్తే.. వ‌ల్లభ‌నేని వంశీ మ‌ళ్లీ టీడీపీ సైకిల్ ఎక్కే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.దీనికి రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి ఆయ‌న పార్టీకి దూర‌మైన నేప‌థ్యంలో అటు చంద్రబాబును, ఇటు లోకేష్‌ను కూడా టార్గెట్ చేస్తూ.. తీవ్ర విమ‌ర్శలు చేశారు. దీంతో ఆయ‌నను తిరిగి చేర్చుకునే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదే స‌మ‌యంలో జిల్లాలోనూ మాజీ మంత్రి దేవినేని ఉమాకు.. వంశీకి అస్సలు ప‌డ‌దు. ఈ క్రమంలో ఇది కూడా వంశీకి అడ్డంకిగా మార‌నుంది. ఈ నేప‌థ్యంలో వంశీని తీసుకునే అవ‌కాశం లేదు. ఇక‌, వాసుప‌ల్లి గ‌ణేష్ ప‌రిస్థితి కూడా ఇంతే. వైసీపీ నేత‌ల ఆదేశాల మేర‌కు టీడీపీని టార్గెట్ చేశారు. సో.. ఈయ‌న‌కు కూడా అవ‌కాశం లేదు. పైగా గ‌ణేష్‌కు రెండు సార్లు ఛాన్స్ ఇచ్చినా పార్టీ మారి ద్రోహం చేశార‌ని చంద్ర‌బాబుతో పాటు స్థానిక నేత‌లు ఆయ‌న‌పై మండిప‌డుతున్నారు.ఇక‌, మిగిలిన ఇద్దరు.. గిరి, క‌ర‌ణం బలరాంలను గ‌మ‌నిస్తే.. ఈ ఇద్దరూ కూడా వైసీపీ నేత‌ల నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ.. చంద్రబాబును ప‌న్నెత్తు మాట అన‌డం లేదు. ఇంకా ఆదిలో గిరి కొన్ని ఆరోప‌ణ‌లు చేసినా.. క‌ర‌ణం మాత్రం ప‌న్నెత్తు మాట అన‌క‌పోగా.. ఎక్కడా టీడీపీకి వ్యతిరేకంగా ఆయన వ్యవ‌హ‌రించింది కూడా లేదు. ఈ ఇద్దరిలోనూ క‌ర‌ణం మాత్రం ఇప్పటికీ టీడీపీ వాస‌న‌లు పోకుండా.. భ‌విష్యత్తులో టీడీపీ అవ‌స‌రం వ‌స్తుందేమో అన్నట్టుగా రాజ‌కీయం చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇటీవ‌ల ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు రాయ‌ల‌సీమ ప‌థ‌కంపై ముఖ్యమంత్రికి లేఖ రాశారు.అప్పుడు అధిష్టానం నుంచి ఆయ‌న్ను ప్రెస్‌మీట్ పెట్టి కౌంట‌ర్ ఇవ్వమ‌న్నా ఇవ్వలేద‌ని వైసీపీ నేత‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయ‌ట‌. ఇక జిల్లాకు చెందిన మంత్రి బాలినేని సైతం తాము ఎంత చేస్తున్నా క‌ర‌ణం, ఆయ‌న త‌న‌యుడు వెంక‌టేష్ మాత్రం పార్టీకి ఇబ్బంది వ‌చ్చిన‌ప్పుడు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే రేప‌టి వేళ తేడాపాడాలు వ‌స్తే క‌ర‌ణం మాత్రం రీ జంపింగ్ చేసే నేత‌ల లిస్టులో ముందే ఉంటార‌ని అంటున్నారు.

Related Posts