YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హరీష్ ఇలాకాలో నర్సులే దిక్కు

హరీష్ ఇలాకాలో నర్సులే దిక్కు

మెదక్, ఆగస్టు 13, 
ఐసీయూ అంటేనే పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని అర్థం. అలాంటి అత్యవసర విభాగంలోనే చికిత్స చేయడానికి డాక్టర్లు లేకపోతే ఏంటి పరిస్థితి. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే తంతు కొనసాగుతోంది. ఆస్పత్రి అత్యవసర విభాగానికి వెళితే అక్కడ వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. అత్యవసర విభాగం అంటే ఆ డాక్టర్లు ఎమనుకున్నారో.. కానీ అక్కడ మొత్తం స్టాఫ్ నర్సులే అన్ని తామై సేవలందిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఆ ఆసుపత్రికి వస్తే ప్రాణాలు గాలిలో కలవడం ఖాయం. ఎందుకంటే, అత్యవసర సేవాలందించాల్సిన వైద్యులు అక్కడ అందుబాటులో ఉండరు. ఇదేంటని ప్రశ్నిస్తే.. డాక్టర్ ఐసీయూలో ఉన్నారు. మరో పేషెంటును చూస్తున్నారంటూ ఆ విభాగంలో ఉన్న నర్సులు సమాధానం ఇస్తూ మేనేజ్ చేస్తున్నారు. అత్యవసర సమయంలో సేవలందించాల్సిన డాక్టర్ విధుల్లో లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తే మీకేం కావాలి మేం ఉన్నాంగా.. అంటూ అత్యవసర విభాగంలోనూ నర్సులే డాక్టర్లుగా సేవలందిస్తున్నారు.ఇటీవల ఓ వ్యక్తి భార్య అనారోగ్యంతో అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లిందని హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి వచ్చాడు. అప్పుడు సమయం ఉదయం 6 గంటలు అవుతోంది. తన భార్యకు చికిత్స అందించాలని కోరగా, ఆ సమయంలో ఐసీయూ వద్ద ఒక నర్సు, ఒక అటెండర్ మాత్రమే ఉన్నారు. అప్పటికే వారిద్దరూ నిద్రలో ఉన్నారు. అత్యవసరం కావడంతో వారిద్దరినీ నిద్ర లేపారు. అనంతరం నిద్రలోనే ‘‘పేషెంట్ ఎక్కడ ఉన్నాడు. నడవ గలుగుతాడా’’ అని నిర్లక్ష్యంగా అడిగారు. అనంతరం స్ట్రెచర్ తీసుకొచ్చి పేషెంట్ వద్ద నిల్చున్నాడు. పేషెంట్‌ను స్ట్రెచర్‌పైకి ఎక్కించడానికి బాధితులు ప్రయత్నిస్తుంటే పక్కనే నిల్చొని చూస్తున్నారు. అక్కడే దాదాపు 20 నిముషాల టైమ్ గడిచిపోయింది.అనంతరం పేషెంట్ వివరాలు నమోదు చేసుకొని ఐసీయూలోకి తీసుకెళ్లారు. గంటసేపు అయినా.. డాక్టర్ కనబడకపోవడంతో వారు మెల్లగా సిస్టర్ డాక్టర్ లేరా అని అడిగారు. దీంతో వారు ‘‘మేం చికిత్స చేస్తున్నాము కదా. డాక్టర్ ఐసీయూ ఉన్నారు.’’ అని చెప్పి మీకు అవసరమా అన్నట్లు గద్దించారు. మరో 10 నిముషాలు చూసిన బాధితులు ‘మేడం మేం అత్యవసరమై ఇక్కడికి వస్తే డాక్టర్ ఇంతసేపైనా కనపడటం లేదేంటి’’ అని అడిగారు. దీనికి నర్సు సమాధానిమస్తూ ఐసీయూలో మరో పేషెంట్‌ను చూస్తున్నారు అని చెప్పి కవర్ చేశారు. చివరకు ఏడున్నరకు డాక్టర్ వచ్చి పేషెంట్‌ను చూడకుండానే పేషెంట్ బాగానే ఉన్నారు అని చెప్పి వెళ్లిపోయారు. అత్యవసరమై పేషెంట్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్ వచ్చి చూసేసరికి రెండు గంటలు దాటింది. ఇది సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర విభాగం నిర్వాకం. అక్కడ నర్సులే డాక్టర్లుగా అన్నీ తామై చూసుకోవడం గమనార్హం. అత్యవసర విభాగంలోనే డాక్టర్ లేకుంటే రోగుల పరిస్థితి ఏంటని, స్థానిక ప్రజలు, విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఇలాఖాలో ఆసుపత్రుల పరిస్థితి ఇలా ఉండటం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు.

Related Posts