YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పెద్ద చెరువు సాధన కమిటీ పోస్టుకార్డు ఉద్యమం

పెద్ద చెరువు సాధన కమిటీ పోస్టుకార్డు ఉద్యమం

పెద్ద చెరువు సాధన కమిటీ పోస్టుకార్డు ఉద్యమం
ఆదోని
మండల పరిధిలో పాండవగల్లు చెరువు సాధన కమిటీ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ద్వారా నిరసన తెలిపారు. కమిటీ కన్వీనర్ యం.తాహేర్ వలి నాయకులు వెంకటేష్ లు మాట్లాడుతూ..పాండవగల్లు గ్రామం లోని పెద్ద చెరువు ఆక్రమణకు గురి కావడంతో ప్రభుత్వ చెరువు కింద వంద ఎకరాల సాగుభూమి బీడు భూమిగా మారిపోయింది. గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న బోరు బావులు పూర్తిగా ఎండి పోవడం జరిగింది. కొత్తగా రైతులు బోర్లు వేయాలన్నా 1000 నుండి 1500 అడుగుల లోపు భూగర్భజల ఇంకి పోయిందని అన్నారు. గత నెల 26వ తేదీ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు. అనేకమార్లు ఆదోని ఎమ్మార్వో ఆర్డీవో లకు విన్నవించిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చెరువును ఆక్రమించిన ఆక్రమణదారులు ప్రభుత్వ అధికారులపై కేసు పెట్టిన కేసులు వేగవంతం చేసి ప్రభుత్వం చెరువును స్వాధీనం చేసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మొత్తం ప్రతి ఒక్కరితో పోస్ట్ కార్డుల ద్వారా కలెక్టర్ కి పంపించడం జరుగుతుందని ,కలెక్టర్ స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు చెరువు సాధన కమిటీ సభ్యులు రామంజీ,గోపాల్, వీరన్న, మహబూబ్ బాషా, గిరి స్వామి, వీరాంజనేయులు, తాయన్న, అనంత, రామలింగయ్య, ఈరన్న, నాగరాజు, రాములు, భీమ లింగ స్వామి, వై అంజినయ్య, రంగస్వామి, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts