YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రమాద బీమా సౌకర్యం ద్వారా నామినికి లక్ష రూపాయలు

ప్రమాద బీమా సౌకర్యం ద్వారా నామినికి లక్ష రూపాయలు

ప్రమాద బీమా సౌకర్యం ద్వారా నామినికి లక్ష రూపాయలు
 కామారెడ్డి
ఆగస్టు 13
గాయత్రి బ్యాంకు కామరెడ్డి శాఖ యొక్క ఖాతాదారు  ఓడెల నవీన్ ప్రమాదవశాత్తు మరణించగా,మృతుడికి ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యందు గల గాయత్రి నిర్బయ సేవింగ్ ఖాతాపై గల ప్రమాద భీమా సౌకర్యం ద్వారా నామిని ఓడెల రేఖ కి లక్ష రూపాయల చెక్కును కామరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియ  మరియు బ్రాంచి మేనేజర్ గందె సతీష్ చేతులమీదుగా అందజేశారు.ఈ సందర్భంగా కామరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియ  మాట్లాడుతు మద్యతరగతి వ్యాపార, ఉద్యోగ వర్గ ప్రజలకు గాయత్రి బ్యాంకు వారు ఋణాలను ఇస్తున్నారని, నామమాత్రపు చార్జీలతో లక్ష రూపాయల ప్రమాదబీమా ద్వారా ఖాతాదారుల కుటుంబాలకు తమ వంతు బాధ్యతని నిర్వర్తించగలుగుతున్నారని అన్నారు. కేవలం 9 శాతం సాలుసరి వడ్డీకే బంగారు ఆభరణాలపై గ్రాముకు అత్యధికంగా 'రూ|| 3,000/-తో  ఋణాలను అందిస్తున్నారని, అలాగే రైతులకు వ్యవసాయ రుణాలను కూడా అందిస్తున్నారని తెలియజేశారు.
మరియు బ్యాంకు యొక్క (కస్టమర్ సర్వీస్ పాయింట్) బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ ని నియమించి వినియోగదారుల చెంతకు బ్యాంకు సేవలను తీసుకువచ్చారని తెలియజేశారు.
అనంతరం బ్రాంచి మేనేజర్ గందె సతీష్  మాట్లాడుతూ వినియోగదారులకు 24 గంటల ఏటీఎం లలో నగదు అందుబాటులో ఉంచడం ద్వారా కామరెడ్డి మరియు పరిసర ప్రాంత ప్రజల నగదు అవసరాలను తీరుస్తున్నామని అన్నారు. మరియు సేవింగ్ ఖాతాలు ప్రారంభించుటకు కావలసిన ఫోటో మరియు జిరాక్స్ ను బ్యాంకు యందే ఉచితంగా అందిస్తున్నామని, వ్యాపారస్తులకు వ్యాపార వృద్దికై ఋణాలను అందిస్తున్నామని,
అలాగే కిసాన్ వికాస్ పత్రాలు మరియు పోస్టుఆఫీస్ డిపాజిట్లపై కూడ కేవలం 0.83 పైసలకే అనగా 10 శాతం పిఎ రేటుకి ఋణాసౌకర్యం అందిస్తున్నామని వినియోగదారులు ఇట్టి సౌకర్యాన్ని వినియోగించుకోవలసిందిగా కోరారు.

Related Posts