YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ ఎనిమిదవ నిజాం ఎమ్మెల్యే రాజాసింగ్

కేసీఆర్ ఎనిమిదవ నిజాం ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనమిదవ నిజాం తయారు అయ్యడని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. శనివారం అయన మీడియతో మాట్లాడారు. రాష్ట్రంలో జెండా ఎగరవేస్తే కేసులు బుక్ చేస్తారు, జైలుకు పంపుతారు, రౌడి షీట్లు వేస్తారని దేశానికి తెలియాలి. తెలంగాణలో నిజాం పలన సాగుతోందని అందరికీ తెలియాలి. ఎన్ని కేసులైనా బుక్  చేసుకోండి జెండా ఎగర వేసేందుకు, ర్యాలీ తీసేందుకు ఎలాంటి అనుమతి తీసుకోం. ఏ దేశంలోనూ ,ఏ రాష్ట్రంలోనూ జాతీయ పథాకాన్ని ఎగరవేసేందుకు అనుమతి కోరరని అయన అన్నారు.
గోషామహల్ నియోజక వర్గంలో షాహినాత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిదిలోని బేగం బజార్ లో జాతీయ పతాకంతో ర్యాలీ తీస్తారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తారు. రెండేళ్ళ క్రింతం ర్యాలీ తీసిన యువజన సంఘం అద్యక్షుడితో పాటు నాపై కూడా ఎఫ్ఐఆర్ చేసారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారన్న నేపంతో కేసు బుక్ చేసారని అన్నారు.
ఈ ఏడాది కూడా ఆగస్ట్ 15 న జాతీయ పతాకం ఎగర వేయడంతో పాటు ర్యాలీకి అనుమతి కోరేందుకు యువకులు వెళ్ళారు. పర్మిషన్ మేం ఇవ్వలేమని.. కమిషనర్ ఇస్తారని అని వారికి లెటర్ కూడా ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో జాతీయ పథాకం ఎగిరించాలన్న కూడా అనుమతి కావాలి. జాతీయ పథాకాన్ని ఎగర వేయాలంటే కూడా అనుమతి కోరాలనడం ప్రభుత్వంకు, అధికారులకు సిగ్గుచేటూ. అనుమతి కావాలని కోరిన అధికారులు విషం తాగి చనిపోవాలి. ఎందుకంటే మీరు కాని , మీ పూర్వికులు దేశం గురించి ఏమీ చేయలేదు. ఎంతో మంది త్యాగం చేస్తే దేశానికి స్వాతంత్రం వచ్చిందని అయన అన్నారు. వారి కుటుంబాలను అడిగితే తెలుస్తుంది ఎంత కష్టపడ్డారో. తెలంగాణ పోలీసు అదికారులు స్వతంత్రం కోసం చినిపోయిన వారి కుటుంబాన్ని అడిగితే తెలుస్తుంది. పోలీసులు ఇంక ఘనంగా స్వతంత్ర వేడుకలు జరుపుకోమని చెప్పాలని అన్నారు.
ర్యాలీ తీసేందుకు అనుమతి ఇవ్వడం .. ర్యాలీ తీస్తే కేసులు బుక్ చేస్తాం రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు తెలంగాణ పోలీసులు. దేశం పట్ల మీ భావన ఇదేనా..సిగ్గురావాలి. డీజీపీ , కమిషనర్ మీ లోకల్ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడాలి. ఏ అదికారి ర్యాలీకి అనుమతి ఇవ్వరో, ర్యాలీ తీస్తే జైలుకు పంపిస్తా అనే వారికి సస్పెండ్ చేయాలి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఆగస్టు 15న జెండా ఎగర వేసేందుకు ర్యాలీ తీసేందుకు ఎలాంటి అనుమతి తీసుకోం. రెండేళ్ళుగా కోర్టు చుట్టు తిరుగుతున్నాం.. ఎన్ని కేసులు ఎదుర్కొంటాం. ఎన్ని కేసులైనా బుక్ చేయండి.. మేం అన్నింటికి తయారై ఉన్నామని అయన అన్నారు.

Related Posts