YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 దళితుల ఓట్ల కోసమే దళిత బంధు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసి నిజాయితీ చాటాలి ఎమ్మార్పీఎస్ నేత సతీష్ మాదిగ డిమాండ్

 దళితుల ఓట్ల కోసమే దళిత బంధు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసి నిజాయితీ చాటాలి ఎమ్మార్పీఎస్ నేత సతీష్ మాదిగ డిమాండ్

 దళితుల ఓట్ల కోసమే దళిత బంధు
అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసి నిజాయితీ చాటాలి
ఎమ్మార్పీఎస్ నేత సతీష్ మాదిగ డిమాండ్
జగిత్యాల, ఆగస్టు 14
దళితుల ఓట్ల కోసమే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో హుజురాబాద్ ఎన్నికల ప్రకటన రాకముందే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ యువసేన జిల్లా ఇంచార్జ్ నక్క సతీష్ మాదిగ డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా షెడ్యూల్ కులాల అభివృద్ధి సమగ్ర సాధన కమిటీ ఆధ్వర్యంలో వివిధ డిమాండ్ల పై ఆర్డీవో ఆఫీస్ ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్బంగా నక్క సతీష్ మాట్లాడుతూ దళితులందరి మూడెకరాల భూమిని ఇస్తామని ప్రకటించిన సీఎం ఇచ్చిన హామీని మరిచారన్నారు. దళితులను మరోసారి మోసగించేందుకే తెరపైకి దళిత బంధు పథకాన్ని తెచ్చారన్నారు. సీఎం కేసీఆర్ కు చిత్త శుద్ధి ఉంటే హుజురాబాద్ ఎన్నికల ప్రకటన రాకముందే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దళిత బంధు పతాకాన్ని అమలు చేయాలన్నారు. అలాగే హుజురాబాద్ లో ఉన్న 20 వేల కుటుంబాలకు దళిత బంధు పతాకాన్ని అమలు చేయాలని సతీష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయకుంటే హుజురాబాద్ లో దళితుల ఓట్ల కోసమే ముఖ్యమంత్రి ఎత్తుగడగా దళితులందరు భావించాలని నక్క సతీష్ మాదిగ సూచించారు. ఈ మహాదీక్షలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బోనగిరి కిషన్, ఎం.ఎస్.ఎఫ్.జగిత్యాల మండల ఇంచార్జ్ బొల్లే అనిల్ మాదిగ, బొర్ర గంగారాం, వడ్లూరి దుబ్బయ్య తోపాటు పలువురు వున్నారు.

Related Posts