YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కడపలో ధ్యాన్ చంద్ పేరు మీదుగా   హాకీ అకాడమీ ఏర్పాటు చేయాలి -ప్రజా సంఘాలు డిమాండ్

కడపలో ధ్యాన్ చంద్ పేరు మీదుగా   హాకీ అకాడమీ ఏర్పాటు చేయాలి -ప్రజా సంఘాలు డిమాండ్

కడపలో ధ్యాన్ చంద్ పేరు మీదుగా   హాకీ అకాడమీ ఏర్పాటు చేయాలి
-ప్రజా సంఘాలు డిమాండ్
కడప ఆగస్టు14
కడప నగరంలో ఉన్న  స్పోర్స్ షాప్ చైర్మన్ నివాసం లో  స్పోర్ట్స్ షాప్ రాష్ట్ర చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి జనవికాస్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాహిర్,జేకే యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ బాషా,ఐ యూ ఎం ఎల్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అలీషేర్ లుల ఆధ్వర్యంలో కడపలో ధ్యాన్ చంద్ పేరు మీదుగా హాకీ అకాడమీ ఏర్పాటు చేయాలి అని వినతిపత్రం అందించారు. అలాగే ధ్యాన్ చంద్ విగ్రహం కూడా నిర్మిస్తే బాగుంటుందని వారు తెలియజేశారు.వారు మాట్లాడుతూ   హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ అని జాతీయ క్రీడ అయిన హాకీ క్రీడకు కడప జిల్లాలో దశాబ్దాలుగా విశేష ఆదరణ ఉందని ఎంతోమంది రాష్ట్ర స్థాయి క్రీడల్లో క్రీడాకారులు కడప జిల్లా నుండి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారని వారి పేరు మీద విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు తెలియజేశారు.
దీనికి స్పందించి త్వరలోనే ధ్యాన్ చంద్ విగ్రహం   ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు అలాగే అకాడమీ గురించి కూడా తమ మీటింగ్లో చర్చిస్తానని వారు తెలియజేశారు.
.ఈ కార్యక్రమంలో ప్రముఖ మైనార్టీ నేత అబ్దుల్ వాజిద్,ఇంజిన్ నవీద్ ,రాజేష్ రవి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts