YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గందరగోళం రేపుతున్న ఆడియోలు

గందరగోళం రేపుతున్న ఆడియోలు

హైదరాబాద్, ఆగస్టు 16, 
సోషల్ మీడియా దెబ్బ నాయకులకు అలా ఇలా ఉండటం లేదు. ఒక్కొక్కొ నేత ది ఒక్కో గాథ గా బాధగా మిగిలిపోతుంది. టైమింగ్, రైమింగ్ చూసి సోషల్ మీడియా లో పోస్ట్ అయ్యే పోస్ట్ లు క్షణాల్లో వైరైలయి రాత్రికి రాత్రే నేతల ఫేట్ మార్చేస్తున్నాయి. ఏది నిజం ఏది అబద్ధమో తేలేలోగా వారి కొంపలు కొల్లేరే అవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ లో హుజురాబాద్ ఎన్నికల వేడి బాగా పెరిగింది. దాంతో సోషల్ మీడియా లో వచ్చే కొన్ని పోస్ట్ లు ప్రధాన పార్టీల్లో గందరగోళమే రేపుతున్నాయి.ఒకప్పటి ఈటల రాజేంద్ర ప్రత్యర్థి మొన్నటివరకు కాంగ్రెస్ నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి ఆడియో అందరికి గుర్తుండే ఉంటుంది. తనకు గులాబీ పార్టీ టికెట్ ఖరారు అయ్యిందంటూ ఒక టీఆర్ఎస్ నేతతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్ చేసి ఆయన ప్రత్యర్ధులు సోషల్ మీడియాలో లీక్ చేశారు. దాంతో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టక తప్పలేదు. అలాగే కేసీఆర్ కి జై అనక తప్పలేదు. ఇప్పుడు అదే రీతిలో టీఆర్ఎస్ లో ఉపముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన స్టేషన్ ఘనాపూర్ ఎమ్యెల్యే టి రాజయ్య పరిస్థితి మారిపోయింది.బ్రదర్ అనిల్ ను రాజయ్య ను కలిసిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. మాములుగా అయితే ఇది పెద్ద విషయమేమి కాదు. కానీ వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేయడం మరోపక్క హుజురాబాద్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఒక బలమైన సామాజిక వర్గం కు చెందిన నేత కావడంతో రాజయ్య కొందరికి టార్గెట్ అయ్యారు. దాంతో ఆయన పాత ఫోటోలు ఇప్పుడు కొత్తగా బయటపెట్టినట్లు తెలుస్తుంది. ఫోటో నిజమే కానీ ఇప్పటిది కాదని పాత ఫోటో గా రాజయ్య వివరణ ఇచ్చుకోవాలిసి వచ్చింది.అంతేకాదు వైస్ తనకు రాజకీయ భిక్ష పెడితే కేసీఆర్ రాజకీయ ఉన్నతికి కారకులని చెప్పుకొచ్చారు. 2019 లో బ్రదర్ అనిల్ ను కలిశానని ఒక క్రైస్తవ కార్యక్రమం సందర్భంగా ఈ భేటీ జరిగిందని వైఎస్ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఎప్పటినుంచో ఉన్నాయని అలా ఉండటం తప్పేలా అవుతుందని వాపోయారు. ఇలా రాజయ్య కే కాదు ఇటీవల చాలామంది నేతలకు సోషల్ మీడియాలో చేదు అనుభవాలే షాక్ లు ఇస్తూ ఉండటం గమనార్హం. అయితే వైరల్ బాబులకు బాధితుల బాధ అనవసరం. కాబట్టి ఇలాంటి వార్తలు రోజుకోటి నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటాయి మరి.

Related Posts