YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నారా లోకేష్  అరెస్ట్ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కి తరలింపు  

నారా లోకేష్  అరెస్ట్ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కి తరలింపు  

నారా లోకేష్  అరెస్ట్
ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కి తరలింపు  
గుంటూరు
పరమయ్యగుంటలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆదివారం హత్యకు గురయిన విద్యార్ధిని రమ్య కుటుంబసభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం పరామర్శించారు. ఈ నేపధ్యంలోపోలీసులు  లోకేశ్ను అరెస్ట్ చేసి ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. లోకేష్తో పాటు టీడీపీ నేతలు ధూళిపాళ్ల, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును అరెస్ట్ చేశారు. నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజాలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మాజీ మంత్రులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ పోలీసులు చేశారు. రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మాజీ మంత్రి నక్కా ఆనంద పై చేయి చేసుకున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా ను కింద పడేసారు.  ఈ ఘటనను కవర్ చేస్తున్న మీడియా పై దాడులకు ఎస్పీ విశాల్ గున్ని ఆదేశించారు. స్వయంగా ఎస్పీనే పలువురు మీడియా ప్రతినిధుల పై దాడి చేయడం విశేషం. రూరల్ ఎస్పీ ఒక  చానల్ కెమెరా పగలగొడ్డారు

Related Posts