YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఖనిలో అటల్ బిహారీ వాజ్ పాయి వర్ధంతి

ఖనిలో అటల్ బిహారీ వాజ్ పాయి వర్ధంతి

ఖనిలో అటల్ బిహారీ వాజ్ పాయి వర్ధంతి
పెద్దపల్లి  ప్రతినిధి ఆగస్ట్ 16:
భారతీయ జనతాపార్టీ రామగుండం కార్పొరేషన్ శాఖ అధ్యక్షులు గుండెబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయి వర్ధంతిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమక్షంలో గోదావరిఖనిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్ పాయి ఆర్ఎస్ఎస్ లో ప్రచారం జీవితాన్ని ప్రారంభించి భారతీయ జనసంఘ్ సేవలు అందించారు.  తర్వాత భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి జాతీయ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా కార్యకర్తలను తయారు చేసారు. గొప్ప రాజనీతిజ్ఞుడు అజాతశత్రువు గా ఇక సంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప నేత. అయన వారు చూపించిన మార్గంలోనే కార్యకర్తలందరూ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని పార్లమెంటులో 183 సీట్లతో అతిపెద్ద పార్టీగా బిజెపిని 26 ప్రాంతీయ పార్టీలను కల్పి అధికారాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గొంతెమ్మ కోరికలను తీర్చలేక 13 రోజుల పాలనకు ముగింపు పలికి భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రధానమంత్రి కుర్చీపై గాని పదవులపై గాని ఆశ లేదని నిరూపించారు.  నమ్మిన సిద్ధాంతాల కోసం దేశ ప్రజల సేవ కోసమే నాయకులు పని చేస్తారని చెప్పకనే చెప్పడం జరిగింది. తర్వాత మళ్లీ ఎలక్షన్లకు పోయి ఎన్డీఏ ఆధ్వర్యంలో భారత ప్రధానిగా ఐదు సంవత్సరాలు కాంగ్రెసేతర ప్రధానిగా ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా మచ్చలేని నాయకునిగా 26 ప్రాంతీయ పార్టీల కూటమి దేశ ప్రజల అందరి మన్ననలు పొందుతూ పరిపాలన సాగించడం జరిగిందన్నారు. అందరి మన్ననలు పొంది దేశంలో అన్నపూర్ణ ఆవాస్ యోజన సడక్ యోజన ద్వారా గల్లి నుండి ఢిల్లీ వరకు తా రోడ్లను ఏర్పాటు చేసిన ఘనత అటల్ బిహారీ వాజ్ పాయి అన్నారు. వారు చూపించిన మార్గంలోనే నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలు మనల్ని పొందుతూ వారి ఆశయాలను ప్రపంచ దేశాలకు చాటిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ వాజ్పేయిని ఆదర్శంగా తీసుకుని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నీతి నియమాలను పాటిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఎదిగి ప్రజల మన్ననలు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గార్ల ధర్మపురి,  కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శులు గొర్రె రాజు, పల్లికొండ నర్సింగ్, తడగొండ నర్సయ్య, మంచికట్ల బిక్షపతి, మండల అధ్యక్షులు కోమల పురుషోత్తం, దాసరి శ్రీనివాస్, మిట్టపల్లి సతీష్ కుమార్, దేవి రాజు, పెండ్యాల రవి కుమార్, జనగామ రాయాలింగు, కార్పొరేషన్ ఉపాధ్యక్షులు ఉప్పలంచల శ్రీనివాస్, కార్పొరేషన్ కోశాధికారి తూముల వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ కార్యదర్శి ఆంకారీ భరత్, మండల ప్రధాన కార్యదర్శులు మామిడి వీరేశం, బుంగ మహేష్, డబ్బెట కమలాకర్, భాషబోయిన వాసు, చల్లా శ్రీనివాస్, గోషికా రమేష్ సంతోష్ తదితరులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Related Posts