YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీసీ సంక్షేమ సంఘం మహిళా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొన్నం లావణ్య

బీసీ సంక్షేమ సంఘం మహిళా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొన్నం లావణ్య

బీసీ సంక్షేమ సంఘం మహిళా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొన్నం లావణ్య
జగిత్యాల, ఆగష్టు  16
బీసీ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొన్నం లావణ్య ను నియమించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు గాజుల  నాగరాజు నియామక పత్రం ఆదివారం లావణ్యకు అందజేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన లావణ్య బీసీ సంక్షేమ సంఘంలో చురుకుగా పాల్గొంటున్న నేపథ్యంలో ఆమెను ఈ పదవిలో నియమించామని,  సంఘం బలోపేతానికి కృషి చేయాలని నాగరాజు సూచించారు.ఈ సందర్భంగా నియామకమైన పొన్నం లావణ్య మాట్లాడుతూ నాపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని బీసీ మహిళలను సంఘటితపరచి హక్కుల సాధనకు పాటు పడతానని అన్నారు.
ఈ సందర్భంగా జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి,బీసి సంక్షేమ సంఘం అధ్యక్షులు గాజుల నాగరాజు, పెండెం మహేందర్, చింత రోజా, జలంధర్, బొమ్మకంటి చంద్ర గౌడ్, బాలె వరుణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పాళోజి సత్యం, ఆరె శంకర్, చందనగిరి సాయిరాం, పుప్పాల నరసింహాచారి లతోపాటు తదితరులు అభినందిచారు.

Related Posts