YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దళితులను మరోసారి మోసగించేందుకే తెరపైకి దళిత బంధు బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా

దళితులను మరోసారి మోసగించేందుకే తెరపైకి దళిత బంధు బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా

దళితులను మరోసారి మోసగించేందుకే తెరపైకి దళిత బంధు
బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా
జగిత్యాల, ఆగస్టు 16
దళితులను మరోసారి  మోసాగించేందుకే సీఎం కేసీఆర్ తెరపైకి దళిత బంధు పథకాన్ని తెచ్చాడని హుజురాబాద్ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని బంధు అవుతాయని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా అన్నారు. భారతీయ జనతా పార్టీ దళిత మోర్చాజగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం జగిత్యాల పట్టణంలోని బూసి లక్ష్మీనారాయణ గార్డెన్ లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా     రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షుడు కొప్పు భాషా హాజరై మాట్లాడుతూ దళితులను మోసాగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ల కోసమే దళిత బంధు పథకం తెరపైకి తెచ్చిందని ఎలక్షన్ ముగియగానే ఆపేస్తారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయని ఉపఎన్నికలు వస్తే దళితులకు న్యాయం జరుగుతుందనే సిద్ధాంతాన్ని కేసీఆర్ ద్వారా తెలుసుకున్నామని  అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు  మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దళిత పక్షపాత పార్టీ అని దానికి ప్రత్యక్ష సాక్ష్యాలే అంబేద్కర్  పేరు మీద పంచ తీర్థ క్షేత్రాలు అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు.
అలాగే జగిత్యాల జిల్లాలో దళితుల విద్యా విషయం ఆర్థిక అభివృద్ధి విషయమై ప్రభుత్వ ఐటిఐ కళాశాల మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మర్ శంకర్, రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు అలగుర్తి లక్ష్మీ నారాయణ స్వామి, పట్టణ అధ్యక్షుడు నక్క జీవన్, మండల అధ్యక్షులు తరాల మహేష్, జిల్లా బిజెపి కోశాధికారి సుంకేట్ దశరథ రెడ్డి, మహేష్ కుమార్, చిలకమర్రి మదన్ మోహన్, కొక్కు గంగాధర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షలు జగదీష్, పట్టణ అధ్యక్షులు వీరభద్రుని అనిల్,  మండల అధ్యక్షులు నలువాల తిరుపతి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు రవితేజ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు..

Related Posts